పెళ్లైనా తండ్రి జాబ్ కు కూతురు అర్హురాలే: మద్రాస్ హైకోర్టు

images

పెళ్లైనా కూడా తండ్రి జాబ్ పొందేందుకు కూతురు అర్హురాలేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోతే, కారుణ్య నియామకాల  ద్వారా ఆ జాబ్ కన్న కూతురికి ఇవ్వొచ్చని కోర్టు స్పష్టం చేసింది. పెళ్ళైన కొడుకు జాబ్ పొందుతుంటే… కూతురుకు ఆ జాబ్ ఎందుకు రాదని జడ్జి ప్రశ్నించారు. పెళ్లి కారణంతో…కొడుకు, కూతురు మధ్య తేడా చూపించడం, సమానత్వ హక్కుకు వ్యతిరేకమని జడ్జి అభిప్రాయపడ్డారు.గవర్నమెంట్ జాబ్ చేస్తూ చనిపోయిన తన తండ్రి ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఆ డిపార్టుమెంటు అధికారులు ఒప్పుకోలేదని చెన్నైకి చెందిన రేణుక మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. పెళ్లి కావడమే దానికి కారణమని కోర్టుకు విన్నవించింది. పెళ్లి రీజన్ చూపిస్తూ అధికారులు తనకు ఉద్యోగాన్ని ఇవ్వలేదని కంప్లైంట్ చేసింది. దీంతో 8 వారాల్లోగా రేణుకకు ఆమె తండ్రి జాబ్ ఇవ్వాలని హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy