పేదరిక నిర్మూలనే మన లక్ష్యం

5426d68aa139eఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణల అవసరం.. కొత్త విధానాల ద్వారా అభివృద్ధి బాటలో ప్రయాణిద్దామని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ఆయన.. పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచదేశాలకు పలు సలహాలు, సూచనలు చేశారు. 2030 టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్లాలన్నారు. ఎన్డీఏ సర్కారు అమలు చేస్తున్న పథకాలను UNOలో వివరించారు.

పేదల ఆర్థికాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని సభ్యులకు వివరించారు ప్రధాని. జన్ ధన్ యోజన. పెన్షన్ స్కీంలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. విద్యతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు నమో. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. UNO తో భారత్ కు ఉన్న అనుబంధంపై ఓ పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. అలాగే సిప్రస్ ప్రెసిడెంట్ నికోస్, శ్రీలంక అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన , ఈజిప్ట్ ప్రెసిడెంట్  అబ్దుల్ ఫతాఇల్ సిసి, స్వీడప్ ప్రధాని స్టీఫెన్ లోఫెన్, భూటాన్ ప్రధాని షెరింగ్ టాబ్గే, జోర్ధాన్ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ లతో మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్చలపై డిస్కస్ చేశారు.

అంతకుముందు ప్రపంచబ్యాంకు అధ్యక్షునితో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. దేశంలో వాతావరణ పరిస్థితులపై డిస్కస్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛబారత్, క్లీన్ గంగా కార్యక్రమాలు సూపర్బ్ అని కితాబిచ్చారు వాల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్.  ఐక్యరాజ్యసమిలో ప్రసంగించిన మోడీ… ప్రపంచదేశాలకు దిశానిర్ధేశం చేస్తూనే దేశంలో ప్రవేశపెట్టిన పథకాలు… దేశ గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy