పేదోళ్ల బిడ్డ కాకా 88వ జయంత్యుత్సవం

kaka 1కార్మిక నేత, అమరజీవి కాకా 88వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది సర్కార్. ట్యాంక్ బండ్ లోని సాగర్ పార్క్ లో జయంతి వేడుకలు జరుగనున్నాయి. మంత్రులు, అభిమానులతో పాటు  కాకా కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.

అరవై ఐదేళ్ల రాజకీయ జీవితం, దేశంలోనే సీనియర్ నేత, ఉద్యమకారుడు, గాంధేయవాది, తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు, దళిత నేత గడ్డం వెంకటస్వామి. పేదల నాయకుడిగా ఎదిగి కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.  కాకాగా జనం ప్రేమగా పిలుచుకునే జి. వెంకటస్వామి …  సేవలను అరుదైన గౌరవంతో స్మరించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఇవాళ కాకా 88వ జయంతి సందర్భంగా  ట్యాంక్ బండ్ లోని సాగర్ పార్క్ లో  విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్. వీరితోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అభిమానులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు హజరుకానున్నారు.  కాకా జయంతి వేడులకను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. జయంతివేడుకల  ఏర్పాట్లను HMDA కు అప్పగించింది. దీంతో కాకావిగ్రహం ఉన్న సాగర్ పార్కును  సుందరంగా ముస్తాబు చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy