
94 శాతం స్కూల్స్ లో నిల్ ఆర్ ఈ చట్టం ప్రకారం టీచర్, విద్యార్థుల రేషియో, మౌలిక వసతులు, బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, భవనాలు,ప్రిన్సిపల్స్ కు వేర్వేరు గదులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ విద్యార్థు లకు ప్రత్యే క సదుపాయాలు, తాగునీరు, వంటగదులు, ఆటస్థలం, స్కూల్ కి ప్రహరీ తదితర కనీస ప్రమాణాలను పాఠశాలలు కలిగి ఉండాలి. కానీ.. జిల్లాలోని 94శాతం ప్రైమరీ స్కూల్స్ ఈ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనట్లు యూడీఐఎస్ఈ తెలిపింది. రాష్ట్రస్థాయిలో చట్టం అమలు తీరును స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎస్సీపీసీఆర్) కమిటీ పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం ఎస్సీపీసీఆర్ కమిటీకి ఉంటుంది. అయితే రాష్ట్రంలో 2017 నుంచి ఈ కమిటీ ఏర్పాటు కాలేదు.
ప్రభుత్వాలదే బాధ్యత
విద్యా హక్కు చట్టం ( రైట్ టూ ఎడ్యుకే షన్(ఆర్ ఈ) ఏప్రిల్ 1, 2010న) అమల్లోకి వచ్చిన రెండేళ్ల వరకు దీనిపై యాక్టివ్ మూవ్మెంట్స్ లేవు. దీంతో చట్టం అమలు తీరుపై కొందరు విద్యా వేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ..2012లో కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 25శాతం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్(ఈడబ్ల్ యూఎస్) పరిధిలోకి వచ్చే విద్యార్థులకు విధిగా అడ్మిషన్లు ఇవ్వాలని తెలిపింది. 6 –14 ఏళ్ల వారందరికీ ఫ్రీగా విద్యను అందించాలని, చట్టం పకడ్బందీగా అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.