పేలిన ఐఫోన్‌ XS మ్యాక్స్‌ మొబైల్

లోకల్ ఫోన్లు, చైనా మొబైల్సే కాదు…కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు కూడా పేలుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ పేలింది . ఓ వ్యక్తి జేబులోనే ఐఫోన్‌ XS మ్యాక్స్‌ కాలిపోయిన ఘటన అమెరికాలోని ఒహైయోలో జరిగింది. ఫోన్‌ కాలిపోవడంతో తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ యాపిల్ సంస్థ‌పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబరు 12న ఈ ఘటన జరిగింది. జె.హిల్లర్డ్‌ అనే వ్యక్తి లంచ్‌ చేస్తున్న సమయంలో అతడి ప్యాంట్‌ జేబులోని ఐఫోన్‌ నుంచి కాలిన వాసన వచ్చింది. అయితే కొద్ది సేపటికి ఫోన్‌ వేడెక్కి ప్యాంట్‌ కాలిపోయింది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు.  పక్కనే ఉన్న అతడి తోటి ఉద్యోగి గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు.

అయితే.. ఐఫోన్‌ జేబులో కాలిపోయి గాయపడినందుకు పరిహారం చెల్లించాల్సిందిగా యాపిల్‌ స్టోర్‌ నిర్వాహకులను డిమాండ్‌ చేస్తున్నాడు బాధితుడు. స్మార్ట్ ఫోన్ కాలిపోతున్న విజువల్స్ తన ఆఫీస్‌ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిందని చెప్పుకొచ్చాడు. పేలిన ఫోన్‌కు బదులు కొత్త ఐఫోన్‌ ఇస్తామంటూ నిర్వాహకులు చెప్పగా అందుకు హిల్లర్డ్‌ నిరాకరించాడు. ప్యాంట్‌ కాలిపోవడమే కాకుండా తనకు గాయమైందని.. ఈ మొత్తానికి పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేశాడు. దీనికి యాపిల్‌ స్టోర్‌ నిర్వాహకులు నిరాకరించారు. దీంతో కంపెనీపై చట్టపరంగా చర్యల కోసం హిల్లర్డ్‌ సిద్ధమవుతున్నాడు. గత నెలలోనూ ఐఫోన్‌ ఎక్స్‌ పేలిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy