పైడి జైరాజ్.. బాలీవుడ్ ను మెప్పించిన తెలుగోడు

jairaj_1401893720పైడి జైరాజ్… ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ అక్కినేని కంటే ముందే ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువాడు ఆయన. అద్భుత నటనతో తెలుగువాడి సత్తాను చాటిన జైరాజ్ పుట్టింది ఈ రోజే. కరీంనగర్ లో 1909 సెప్టెంబర్ 28న  పుట్టారు జైరాజ్. స్వయంకృషితో సినిమా రంగంలో ఎదిగారు. మూకీ యుగంలో 11 సినిమాల్లో, ఆ తర్వాత 156 టాకీ సినిమాల్లో నటించారు. హీరో రోల్స్ తో పాటు కేరక్టర్ పాత్రల్లోనూ మెప్పించారు. హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ సినిమాల్లో కూడా నటించారు. మెహర్, రాజ్ ఘర్, మాల, ప్రతిమ అనే నాలుగు సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. పి.జె. ఫిల్మ్స్ బ్యానర్ తో నర్గీస్ హీరోయిన్ గా సాగర్ అనే సినిమా కూడా తీశారు జైరాజ్.  టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ లాంటి చారిత్రక పాత్రలపై తన ముద్ర వేశారు జైరాజ్. హిందీ తెరపై హీరోగా నటించిన మొదటి తెలుగువాడు ఆయనే. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలకు 1982లో దాదా సాహెబ్ ఫాల్కే అందుకన్నారు. జైరాజ్ 2000 సంవత్సరం ఆగస్టు 11న కన్నుమూశారు.

Jairaj_18668411850355773203872213959103

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy