పైన బాటిల్ పడిందని మహిళను చంపేశాడు.. ఢిల్లీలో దారుణం

కత్తితో దాడి చేసిన ఆజాద్

న్యూఢిల్లీ: ఇరుపొరుగు అన్నాక చిన్నచిన్న గొడవలు సహజమే. కానీ ఆ వ్యక్తి అసలది గొడవే కాదనిపించే విషయాన్ని పెద్ద రచ్చచేసి.. ఏకంగా ఒక మనిషి ప్రాణం తీసేశాడు. కుటుంబం మొత్తంపైనా కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు వేడుక చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ఆ గొడవను సెల్ ఫోన్లలో వీడియోలు తీసి షేర్ చేశారు. ఢిల్లీలో బుధవారం ఈ దారుణం జరిగింది. ఢిల్లీలోని ఖ్యాలా ప్రాంతంలో మహ్మద్ ఆజాద్(40), వీరూ(41)లు పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం వీరూ కూతురు… ఇంటి బాల్కనీలో నిల్చుని ఉండగా ఆమె చేతిలోని బాటిల్ జారి కింద ఉన్న ఆజాద్ పైన పడింది. కోపంతో ఊగిపోయిన ఆజాద్ ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరూ భార్య సునీత (35)పై గొడవకు దిగాడు.

ఆకాశ్, సునీత

మళ్లీ బుధవారం అదే విషయంపై ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. రాత్రి 7.30 గంటల సమయంలో భర్త రాగానే సునీత జరిగిన విషయం చెప్పింది. దీంతో దంపతులిద్దరితో పాటు వారి కొడుకు ఆకాశ్ (18) ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో దాడి చేయడానికే అన్నట్లు కత్తితో సిద్ధంగా ఉన్న ఆజాద్ వారి ముగ్గురిని పోడిచేశాడు. ఆ తర్వాత భయంతో పారిపోయాడు. ఈ ఘటనలో సునీత అక్కడికక్కడే మరణించింది. వీరూ, ఆకాశ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ కొట్లాట జరిగే సమయంలో చుట్టుపక్కల వారెవరూ కనీసం ఆజాద్ ను ఆపే ప్రయత్నం చేయలేదు. గుంపుగా నిల్చుని వేడుక చూశారు. కొందరు మొత్తం ఇన్సిడెంట్ ను సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. దాడి చేసి పరారైన ఆజాద్ ఆ తర్వాత పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. చుట్టుపక్కల వారు ఏమి చేస్తారోనన్న భయంతో అతడి కుటుంబం కూడా పరారైంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy