‘పైసా వసూల్’ : కొంటె న‌వ్వు పాటలో అదరగొట్టిన బాలయ్య

bal పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా నటించిన 101వ చిత్రం ‘పైసా వ‌సూల్’ విడుదలకు సిద్ధమవుతుండటంతో.. ప్రమోష‌న్స్ జోరు పెంచాయి సినిమా యూనిట్.  సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్ర రిలీజ్ ఉండ‌టంతో మేక‌ర్స్ సినిమాలోని ఒక్కొక్క సాంగ్‌ని ప్రోమోలుగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన‌ కొంటె న‌వ్వు అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ఎన్టీఆర్, వాణిశ్రీ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందిన ‘జీవిత చక్రం’ చిత్రంలోని పాట‌కి రీమేక్. ఈ పాట‌లో బాల‌య్య వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయి. ఎన్టీఆర్, వాణిశ్రీ నటించిన సినిమాలోని ఈ పాట అప్పట్లో సూపర్ హిట్ సాంగ్ కావడంతో, బాలయ్యకు కలిసి వస్తుందని టీం భావిస్తోందట. బాల‌కృష్ణ సరసన అందాల భామలు శ్రేయ‌, ముస్కాన్‌లు  హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో.. కైరా ద‌త్ స్పెష‌ల్ సాంగ్ తో సంద‌డి చేసింది.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy