పొగలు, సెగలూ లేవు : పట్టాలెక్కిన వరల్డ్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు

ప్రపంచంలోనే హైడ్రోజన్ పవర్ తో నడిచే మొట్టమొదటి రైలు పట్టాలెక్కింది. ఆదివారం(సెప్టెంబర్-16) జర్మనీలో హైడ్రోజన్ రైలుని పట్టాలెక్కించారు. అల్‌ స్టోమ్ కంపెనీ తయారుచేసిన ఈ అధునాతనమైన రైలు కాలుష్యానికి చెక్ పెడుతుంది. కొరాడియా ఐ లింట్ ట్రైన్స్ అని కంపెనీ వీటికి పేరు పెట్టింది. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు నించి ఎటువంటి పొగలు రావు. కార్బన్ డయాక్సైడ్ విడుదల కాదు. నీరు లేదా ఆవిరి మాత్రమే ఎగ్జాస్ట్ లోనుంచి బయటకు వస్తుంది.
హైడ్రోజెన్ శక్తితో నడిచే ఈ రైళ్లలో…మొబైల్ ఫోన్లు, ఇతర హోమ్ అప్లయన్సస్ లో వాడే లిథియం- అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఒకసారి హైడ్రోజెన్ ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్లు వరకూ నడుస్తుంది. ఒక్కో రైలు ఖరీదు మన కరెన్సీలో రు.49 కోట్లుగా ఉంది. త్వరలో 14 హైడ్రోజన్ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు జర్మనీ అధికారులు తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy