లంబూ జంబూ….షేక్ హాండ్!

tallest_smallest_man_afp_650వాళ్లిద్దరూ పూర్తిగా డిఫరెంట్. ఒకళ్లు…..గట్టిగా చేయి చాస్తే……మబ్బులు తగులుతాయి. ఇంకొకళ్లేమో…..భూమిపై ఎక్కడున్నాడా…..అని వెతుక్కోవాలి. అంత పొడుగు, అంత పొట్టి అన్నమాట. వీళ్లిద్దరూ ఓ చోట కలిస్తే ఎలా ఉంటుంది……? తెలుసుకోవాలంటే… ఈ స్టోరీ  చదవాల్సిందే…..

ఈ సీన్ చూడగానే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు….లంబు…జంబు. ఈ ఇద్దరూ సామాన్యులు కాదు. ఒకరు….ప్రపంచంలోనే అతి పొడగరి…..ది టాలెస్ట్. మరొకాయన……అతి పొట్టి మనిషి…ది షార్టెస్ట్.

Image 1ఓ చేతిలో కర్ర తో ….కొద్దిగా ఇబ్బంది పడుతూ నడుస్తున్న సూట్ వాలా ……టర్కీ దేశస్తుడు. పేరు ……సుల్తాన్ కోసెన్.  పేరులోనే కాదు…..హైట్ లోనూ ….సుల్తానే. ఎత్తు…. 2.51 మీటర్లు. ప్రపంచంలోనే ఇదొక రికార్డు.

అడుగులో అడుగేసుకుంటూ…..నడుస్తూ వస్తున్న ఆ పొట్టాయన….నేపాలీ. పేరు….చంద్ర బహదూర్ దాంగి. హైట్  …..కేవలం 55 సెంటీ మీటర్లు. ప్రపంచంలోనే ….ఇంత పొట్టి మనిషి ఎవరూ లేరు.

గిన్నెస్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డ్స్ ….లేటెస్ట్ గా లండన్ లో ఓ ఈవెంట్ కండక్ట్ చేసింది. ఆ ఈవెంట్ లో ఆ పొడుగాయన….పొట్టాయన కలుసుకున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చారు…..జనానికి నవ్వులు పంచారు.

హైట్ లోనే కాదు……..ఏజ్ లోనూ లంబూ….జంబూలో ఎంతో తేడా. సుల్తాన్ సాబ్ ….థర్టీ ప్లస్ అయితే, బహదూర్  భాయ్………….సెవెంటీ ప్లస్.

Image 3బహదూర్ భాయ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సుల్తాన్ సాబ్ …..తెగ ఇబ్బంది పడిపోయాడు. సగానికి పైగా నడుం వంచాడు. ఫొటో గ్రాఫర్లు ….ఒక పట్టాన క్లిక్ మనిపించరు కదా……వాళ్లు ఓకే అన్నాక….హమ్మయ్య అనుకున్నాడు.

 

Image 4బహదూర్ కు నిలబడి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో….చుక్కలు కనిపించాయి సుల్తాన్ కు . మళ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం వస్తే…..నా వల్ల కాదు బాబోయ్ …..అంటూ చేతులెత్తేశాడు. సోఫాలో కంఫర్ట్ బుల్ గా కూర్చుని….షేక్ హ్యాండ్ ఇచ్చి…..ఓ పని అయిపోయిందనిపించాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy