పొరపాటు తీసిన ప్రాణాలు : బ్రేక్ బదులు.. ఎక్స్ లేటర్ తొక్కాడు

carఅప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉన్నారు. చక్కగా కాలక్షేపం కూడా చేశారు. అందరూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎవరితోనూ శతృత్వం కూడా లేదు. ఒకరికి ఒకరు ఆపాయ్యంగా ఉన్నారు. వీరి కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో లేక వారి తలరాత అలా బ్రహ్మ రాశాడోగానీ.. క్షణాల్లోనే ఆ ఇంట్లో రెండు ప్రాణాలు గాల్లో కలిశాయి. తప్పొప్పులు లెక్కించుకున్నా పోయిన ప్రాణాలు మాత్రం తిరిగిరావు కదా.. కారు బ్రేక్ వేయబోయి.. ఎక్స్ లేటర్ తొక్కాడు. అంతే వేగంగా వెళ్లిన కారు ఇంట్లోని తల్లి, చెల్లిపైకి దూసుకెళ్లింది. అక్కడిక్కడే ఇద్దరూ చనిపోయారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ లో జరిగింది. లోకల్ SI వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటి యజమాని జంగయ్య గత ఏడాది చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు.. సంవత్సరీకానికి వచ్చారు. ఉగాది పండుగ కూడా ఉండటంతో కూతురు పద్మ.. తల్లి సత్తెమ్మ దగ్గరే ఉండిపోయింది. గురువారం (మార్చి 30, 2017) ఉదయం ఇంట్లోని బావ, బామ్మర్ది బుచ్చిరాములు, సత్యనారాయణ ఇంట్లో నుంచి కారులో బయటకు వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చారు. కారు డ్రైవ్ చేస్తున్న సత్యనారాయణ.. కారును రివర్స్ లో ఇంట్లోని పార్కింగ్ ప్లేస్ లోకి తీసుకెళుతున్నాడు. అప్పటికే పార్కింగ్ కు కొంచెం అవతల.. తల్లి సత్తెమ్మ, కూతురు పద్మ కూర్చుని ఉన్నారు. మామూలుగా కారు వచ్చి పార్కింగ్ ప్లేస్ ఆగుతుంది అనుకున్నారు. పార్కింగ్ ప్లేస్ లోకి కారు వచ్చిన తర్వాత బ్రేక్ వేయాల్సింది పోయి.. పొరపాటున ఎక్స్ లేటర్ తొక్కాడు సత్యానారాయణ అంతే.. కారు వేగంగా తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలయ్యాయి ఇద్దరికీ. పద్మ స్పాట్ లోనే చనిపోతే.. సత్తెమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అల్లుడు బుచ్చిరాజు కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy