
ఫుట్ బాల్ ఆట ఆడేందుకు గ్రౌండ్లోకి దిగిన తర్వాత బాల్ లేకుండా ఉన్నట్లుంది అని అన్నాడు ఓ క్రీడాకారుడు. తమ ఫోన్లో పోకెమాన్ మ్యాప్ ఓపెన్ అవుతున్నా…ఆడేందుకు పోకెమాన్ స్టాప్స్ లేవని ఆయన అన్నాడు. పోకెమాన్ గేమ్ లేకపోవడంతో ఇతర క్రీడాకారులను కలిసి మట్లాడే అవకాశం దొరికిందని కెనడా హాకీ ప్లేయర్ మాథ్యూ సార్మెంటో అన్నాడు. అయితే ఒత్తిడిలో ఉన్న సమయంలో పోకెమాన్ గేమ్ ఆడితే కొంత రిలీఫ్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని మ్యాధ్యూ వ్యక్తపరిచాడు.
క్రీడాకారుల నిరుత్సాహానికి గురికావడంతో రియో మేయర్ ఎడ్వర్డ్ పేస్ పోకెమాన్ గేమ్‌ను బ్రెజిల్లో త్వరగా విడుదల చేయాలంటూ ఆ గేమ్ డెవెలపర్స్ను రిక్వెస్ట్ చేశాడు.