ఇక్కత్ చీర సొగసే వేరు..!!

IMG_3626రోజుకో ఫ్యాషన్ మారిపోతోంది.. నెలకో ట్రెండ్ వచ్చేస్తోంది. ఎన్ని వచ్చినా.. మగువల మనసు దోచేది మాత్రం చీరలే. రాష్ట్రంలో ఎన్నో రకాల పట్టుచీరలు తయారవుతున్నా.. నల్గొండ జిల్లాలోని పోచంపల్లి పట్టుచీరలది ప్రత్యేక స్థానం. ఇక్కడి ఇక్కత్ కళ ప్రపంచ ప్రసిధ్ది పొందింది. 1953 లో తొలిసారిగా పోచంపల్లిలో తొలిసారిగా ఇక్కత్ కళ స్టార్టైంది. కర్నాటి అనంతరాములు అనే పెద్దాయన గుజరాత్ లోని బెనారస్ వెళ్లి ట్రైనింగ్ తీసుకుని సిల్క్ తో ఇక్కత్ కళను వెలుగులోకి తెచ్చాడు. ఇక్కత్ కళలో ప్రధానమైనది టై అండ్ డ్రై విధానం. ముందుగా సిల్కును బ్లీచింగ్ చేసి ఆరబెడతారు. చిక్కులుగా ఉన్న పట్టుదారాల నుంచి ఒక్కో పోగును తీసుకని రాట్నంపై వడుకుతారు. అలా వడికిన పట్టను మొత్తం కండెలకు చుడతారు. కండెల నుంచి దారమంతా ఆసు పోస్తారు. ఎంపిక చేసుకున్న డిజైన్ ను ఆసుపై పోస్తారు. చిటికి ద్వారా డిజైన్ చేస్తూ రబ్బరుతో ముళ్లు వేసి కావలసిన రంగులు అద్దుతూ.. అందమైన వస్త్రాలను నేస్తారు.

ఇక్కత్ కళకు 2003 లో భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి. పోచంపల్లి చీరలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎక్స్ పోర్ట్ అవుతుంటాయి. ఒకప్పుడు ఎన్నో కుంటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు. రాను రాను ఆదరణ తగ్గిపోవడంతో చేనేతను వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. ఇంకా 8 వేల మంది చేనేత కార్మికులు ఇదే కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రపంచ ప్రసిధ్ది పొందిన పోచంపల్లి చీరలకు మార్కెటింగ్ కరువైంది. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే ఇక్కత్ కళకు మరింత గుర్తిపు లభిస్తుందంటున్నారు. మార్కెంటింగ్ వ్యవస్థను పటిష్టపరిచి పోచంపల్లి చీరలు సేల్స్ పెరిగేలా చూడాలంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy