పోచంపాడులో సీఎం: తెలంగాణ వరప్రదాయినికి పునరుజ్జీవం

kcrనిజామాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (SRSP) పూర్వవైభవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లతో SRSP పునర్జీవ పథకాన్ని చేపట్టింది.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దగ్గర SRSP పునరుజ్జీవన పథకం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్‌  బుధవారం (ఆగస్టు 9) సాయంత్రమే పోచంపాడుకు చేరుకున్నారు. రాత్రి ఆయన అక్కడి ఎస్సారెస్పీ గెస్ట్ హౌజ్ బస చేయనున్నారు. గురువారం (ఆగస్టు10) ఉదయం 11 గంటలకు పోచంపాడు దగ్గర ఎస్సారెస్పీ పునర్జీవ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టు కింద లబ్ధిపొందే జిల్లాలు ముఖ్యంగా… పాత నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

వీరితోపాటు నల్లగొండ జిల్లా సహా SRSP ఆయకట్టు కింద ఉన్న రైతులంతా పాల్గొననున్నారు. రైతులకు ప్రతి సీజన్‌లో ఎకరానికి రూ.4వేల పెట్టుబడి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పెట్టుబడి పథకం, రైతు సమాఖ్యల ఏర్పాటు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ నేరుగా రైతులతో చర్చించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy