పోచారం ప్రాజెక్ట్ కు వందేళ్లు

pocharam-project-nzbనిజాం కాలంలో నిర్మాణం.. ఇప్పటికీ చెక్కుచెదరని కట్టడం.. పోచారంకు అప్పుడే నూరేళ్ల నిండాయి. 1917లో నిర్మాణ పనులు ప్రారంభమై 1922లో పూర్తయింది. ఆనాడు ఆ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 27.11 లక్షలు. మొదట 3.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించినప్పటికీ.. ప్రతికూల పరిస్థితుల కారణంగా 2.423 టీఎంసీలకు పరిమితం చేశారు. యేటా పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 1.52 టీఎంసీలకు పడిపోతోంది. ఆయకట్టు 10,500 ఎకరాలు.

ప్రకృతి అందాలతో ఇప్పుడు పోచారం ప్రాజెక్టు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ పోచారం అభయారణ్యం కూడా ఉండడంతో సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి బాగా ఉంటోంది. అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. ప్రాజెక్టు నీటిని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో గల వ్యవసాయ భూములకు అందిస్తారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ప్రధానకాలువ డిస్ట్రిబ్యూటరీ 01 నుంచి 48 వరకు ‘ఏ’జోన్‌గానూ, 49 నుంచి 73వ డిస్ట్రిబ్యూటరీ వరకు ‘బీ’జోన్‌గానూ విభజించారు.

యేటా ఖరీఫ్‌ సీజన్‌లో రెండు జోన్లకు, రబీ సీజన్‌లో ఒక ఏడాది ‘ఏ’ జోన్‌కు, మరో ఏడాది ‘బీ’జోన్‌కు మాత్రమే నీటిని అందిస్తారు.

వైఎస్సార్‌ ఇచ్చిన నిధులతో..

వైఎస్సార్‌ 2001లో నిర్వహించిన పాదయాత్రలో భాగంగా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో పర్యటించారు. పోచారం ప్రాజెక్టు పరిస్థితిని చూసి చలించిపోయారు వైఎస్సార్‌. అధికారంలోకి వస్తే పోచారం ప్రధానకాలువ ఆధునికీకరణకు నిధులిస్తామని హామీ ఇచ్చారు. అధికారం లోకి రాగానే మాట నిలబెట్టుకున్నారు. రూ.14.30 కోట్లు మంజూరు చేశారాయన.  2006 ఏప్రిల్‌ 7న వైఎస్సార్‌ సీఎం హోదాలో నాగిరెడ్డిపేటకు వచ్చి పోచారం ప్రధానకాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy