పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ కొత్త పుస్తకాలు

Telugu Akademyరాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికోసం మరికొన్ని కొత్త బుక్స్ రెడీ చేస్తోంది తెలుగు అకాడమి. ఈ నెలాఖరులోగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. తెలంగాణ చరిత్ర-సంస్కృతి మొదలు… జనరల్ స్టడీస్ వరకు మొత్తం 8 కొత్త పుస్తకాలను రూపొందిస్తోంది.

తెలుగు అకాడమి రూపొందించే కొత్త పుస్తకాల్లో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశాలే ఉండబోతున్నాయి. తెలంగాణ చరిత్ర -సంస్కృతి, తెలంగాణ ఉద్యమం- రాష్ట్రావతరణ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ పర్యావరణ సమస్యలు –అభివృద్ధి, ప్రభుత్వ పాలన శాస్త్రం, సమాజ శాస్త్రం, తెలంగాణ భౌగోళిక శాస్త్రం, జనరల్ స్టడీస్ వంటి పుస్తకాలను రూపొందిస్తోంది అకాడమి. కొత్త పుస్తకాల్లో ఒకటైన జనరల్ స్టడీస్.. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ముద్రిస్తోంది. వారం రోజుల్లో దీన్ని రిలీజ్ చేయనున్నారు. ఇంటర్మీడియెట్ పాఠ్యాంశాల్లో పొందుపర్చిన కొత్త సిలబస్ కూడా అభ్యర్థులకు యూజ్ అవుతుందని అకాడమి అధికారులు చెబుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy