పోరాట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం

Konda_laxman_bapuji1969 తెలంగాణ పోరాటం. మలివిడత తెలంగాణ ఉద్యమం. 1938లో పౌరహక్కుల ఉద్యమం, 1940లో ఆంధ్రమహాసభ ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, వందేమాతర ఉద్యమం, 1952లో నాన్ ముల్కి ఉద్యమం, 1969లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, 1996లో మలిదశ తెలంగాణ ఉద్యమం, సహకార ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం ఇలా తెలంగాణ గడ్డపై ఎగిసిపడిన అనేక ఉద్యమాలకు అండా, దండా అయ్యారు కొండా లక్ష్మణ్ బాపూజీ.

ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915లో సెప్టెంబర్ 27న  జన్మించారు బాపూజీ. తొంభై ఏడో ఏట 2012 సెప్టెంబర్ 21న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. బతికిన 97 ఏళ్ళూ అనుక్షణం పోరాటంలోనే ఉన్నారు. హైదరాబాద్ కు వచ్చి లా చదివారు. 1930లో 16వ ఏటా బొంబాయి రాష్ట్రంలోని చందా పట్టణంలో మహాత్మగాంధీ చేసిన ప్రసంగంతో ప్రభావితుడైన బాపూజీ …తన తెల్ల షరాయిని గాంధీ టోపీగా కుట్టుకుని పెట్టుకున్నారు. ఒక ఉద్యమాన్ని ఎలా నడపాలో, ఎక్కడ నడపాలో, ఎవరెవరిని కదిలించాలో బాగా తెలిసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంత సమస్యలపై దృష్టి పెట్టారు. పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా అనుక్షణం ప్రజలవైపే నిలబడ్డారు బాపూజీ. మలివిడత తెలంగాణ ఉద్యమంలోనూ బాపూజీది కీలక పాత్ర. వృద్ధాప్యంలోనూ ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు. గాంధేయ మార్గంలో శాంతియుత పద్ధతుల్లో ఉద్యమించి తెలంగాణ బాపూజీ అయ్యారు.1952లో అసిఫాబాద్ నుంచి గెలిచి చట్ట సభలో అడుగు పెట్టారు. 1957 లో చిన్నకొండూరు నుంచి గెలుపొందారు. 1962లో కొద్ది తేడాతో ఓడిపోయారు… అయితే ప్రత్యర్థి అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లోఇదే నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాంధించారు. డిప్యూటీ స్పీకరయ్యారు. మినిస్టరయ్యారు. అన్నింట్లోనూ ఆయన ముద్ర క్లియర్ గా ఉండేది.  ఉద్యమం పక్కదారి పట్టిన ప్రతీసారి కొండా లక్ష్మణ్ బాపూజీ బాధపడేవారంటారు తెలిసినవాళ్లు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు వద్దంటూ కాలికి బలపం కట్టుకొని తిరిగారు. తెలంగాణ ఆకాంక్షను సీమాంధ్రులకు నచ్చజెప్పటంలో అద్భుతమైన పాత్ర పోషించారు. ఈ  తిరుగులేని తెలంగాణవాదిని…తెలంగాణ విముక్తి, ప్రత్యేక రాష్ట్రం కోసం చివరివరకు పోరాడిన కొండ లక్ష్మణ్ శత జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy