పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

konda lakshman bapujiకొండా లక్ష్మణ్ బాపూజీ… స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిప్రదాత. ఆయన పుట్టింది ఈరోజే. ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో పుట్టారు బాపూజీ. లా చేసి 1940లో లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు బాపూజీ. ఆ తర్వాత నిజాం వ్యతిరేక పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ టీంకు బాంబులు అందించారు బాపూజీ. స్వాతంత్ర్యం వచ్చాక… కాంగ్రెస్ నేతగా ఎదిగిన బాపూజీ 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో పదవిని వదులుకున్నారు. తెలంగాణ కోసం పదవులు వద్దనుకున్న మొదటినేతగా చరిత్రకెక్కారు. బడుగు వర్గాల ప్రయోజనాల కోసం సామాజిక ఉద్యమంలోనూ కీలకంగా పనిచేసిన బాపూజీ… రెండో దశ తెలంగాణ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. రెచ్చగొట్టే వాదాలతో కాకుండా.. అన్ని ప్రాంతాల మధ్య సామరస్యంగా విభజన జరగడానికి కృషిచేశారు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఈ అలుపెరుగని యోధుడి శతజయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆదివారం బాపూజీ జయంతి  సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కాగా, ఈనెల 28న బాపూజీ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు జీఏడీ సెక్రెటరీ వికాస్‌రాజ్ శనివారం ఉత్తర్వులు (జీవోఆర్టీ నంబర్ 2636) జారీచేశారు.

Konda-Laxman-Bapuji-exploretelanganaఉత్సవాల నిర్వహణకు ఒక్కొక్క జిల్లాకు రూ.20 వేల చొప్పున బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ విడుదల చేస్తారని, హైదరాబాద్‌లో నిర్వహించే స్టేట్ ఫంక్షన్‌కు రూ.8లక్షలు కేటాయిస్తారని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, వైస్ చైర్మన్లుగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జీ యాదగిరి, కొండా వెంకట రమణ ఉంటారని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీ రాధా ఉత్తర్వులు జారీచేశారు. ఆదివారం బాపూజీ జయంతి అయినప్పటికీ వినాయక నిమజ్జనం ఉన్నందున ఈ నెల 28న శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కే అలోక్‌కుమార్ తెలిపారు. జిల్లాల్లో కూడా 28వ తేదీనే జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పారు.

 

రవీంద్రభారతిలో శతజయంతి సభ

కొండా లక్ష్మణ్ బాపూజీ శతజయంతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. 28న సోమవారం రవీంద్రభారతిలో  సీఎం కేసీఆర్ బాపూజీ శతజయంతి సభను ప్రారంభిస్తారు. కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు,ఎమ్మెల్యేలో పాటు పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొననున్నారు. కార్యక్రమానికి బీసీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షత వహిస్తారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy