పోలీసులకు డీజీపీ ఆదేశం : పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కండి

Gram-Panchayatsపంచాయతీ ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు డీజీపీ మహేందర్‌ రెడ్డి. ఎన్నికలకు హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌, వరంగల్‌ కమిషనరేట్ల పోలీసు బలగాలను వినియోగిస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్సైజ్‌, అటవీ తదితర శాఖల సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఈ సారి పంచాయతీ ఎన్నికలకు నాలుగు కమిషనరేట్ల పోలీసు బలగాలను వినియోగించనున్నట్లు తెలిపారు.

చాలా మంది ఎస్పీలు మొదటి సారి పంచాయతీ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారని చెప్పారు. దీంతో.. ఈ ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా భద్రత విషయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధ వద్దన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత కూడా బందోబస్తు కొనసాగించాలని సూచించారు. ఇప్పటి నుంచే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని.. కింది సిబ్బందికి కూడా అవగాహన కల్పిస్తూ ఉండాలని సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy