పోలీసుల అదుపులో పాక్ జాతీయ గీతం పాడిన ఆటగాళ్లు

pak-anthem-kashmirపాకిస్థాన్ క్రికెట్ దుస్తులు ధరించడంతో పాటు ఆ దేశ జాతీయ గీతం పాడిన 12 మంది యువ క్రికెట్ క్రీడాకారులను అదుపులోకి తీసుకున్నారు జమ్మూకశ్మీర్ పోలీసులు. ఏప్రిల్ 2న ఉత్తర కాశ్మీర్‌లోని గాన్దిర్బాల్‌లో రెండు టీమ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అందులోని ఓ టీం పాకిస్థాన్‌ను పోలిన క్రికెట్ దుస్తులు ధరించడంతో పాటు ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బుధవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ప్రధాని మోడీ కాశ్మీర్‌లో పర్యటించి సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన రోజునే ఈ ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం గురువారం అక్కడకు వెళ్ళినట్లు తెలుస్తోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy