పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

గోవధను అడ్డుకుంటే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. వధకు తరలుతున్న గోవులను రక్షించి గోశాలకు తరలిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు ఆయన. బక్రీద్ సందర్భంగా ముస్లింలు అధిక సంఖ్యలో గోవులు, దూడలను పాతబస్తీకి తరలిస్తున్నారని, వాటిని అడ్డుకుంటామన్నారు.

గోరక్ష కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసుల కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు కమిషనరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవధను ఆపేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. గోవధకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy