పోలీస్ vs జనం..!

ఖాకీలకు రక్షణ లేకుండా పోతోంది. అవును ఇది నిజం… ఇంతకు ముందు కంచే చేను మేస్తే లెవల్లో ఖాకీల దౌర్జన్యాల గురించి చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు ఆ కంచెకే రక్షణ లేకుండా పోయింది. గత 10 రోజుల్లో రెండు ఇన్సిడెంట్లు చూస్తుంటే… ఇది ముమ్మాటికీ నిజమని పిస్తోంది.

VSPGODAVAఇన్సిడెంట్ 1:

జూన్ 22, 2015. అది విశాఖ జిల్లా తగరపు వలస. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రవి అనే యువకుడు పట్టుబడ్డాడు. మొదట పోలీసులతో గొడవ పడ్డ రవి..  ఆ తర్వాత… సైలెంట్ గా వెళ్లిపోయి.. తన ఫ్యామిలీని స్పాట్ కు తీసుకొచ్చాడు. పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్న రవి కుటుంబసభ్యులు.. బంధువులు…. ఎస్సై భాస్కర్రావు.. హెడ్ కానిస్టేబుల్ అప్పల్రాజుతో గొడవపడ్డారు. ‘మావోడిపైనే కేసుపెడతావా?’ అంటూ…. వీరంగం చేశారు. ఎస్సై భాస్కర్రావు పారిపోగా… హెడ్ కానిస్టేబుల్ అప్పల్రాజుపై ఎటాక్ చేశారు జనం. భాస్కర్రావు కంప్లయింట్ తో తగరపు వలసకు చేరుకున్న పోలీసులు… దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు విషయంలో పోలీసుల తీరుకు వ్యతిరేంగా ఊరంతా ఏకమై ఫైట్ చేస్తున్నారు.

2015_3$largeimg10_Mar_2015_134343023ఇన్సిడెంట్ 2:

జూన్ 12, 2015. అది ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని లక్ష్మీ సాగర్. FIR బుక్ చేయనందుకు  పోలీసుల్ని చితక్కొట్టారు. దొరికినొళ్లను దొరికినట్టు బాదేశారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రెగ్నెంట్ భార్యను చంపడానికి భర్త ప్రయత్నించడంతో కాలనీ వాసులు తిరగబడ్డారు. భర్తను చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. భర్తపై కేసు పెట్టడానికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో.. కాలనీ వాసులు ఎటాక్ చేశారు. పోలీసుల్ని కొట్టిన కేసులో..25 మందిపై FIR బుక్ చేశారు. లక్ష్మీసాగర్ లో బలగాల్ని మోహరించారు పోలీసులు.

సంఘటనలు వేరు కావచ్చు. విషయాలు పెద్దవి కాకపోవచ్చు. కానీ పోలీసులపై జనం తిరగబడటం అనేది ఇంపార్టెంట్. తప్పును ప్రశ్నించడం తప్పు కాదు కానీ, చట్టాన్ని జనం చేతిలోకి తీసుకోవడం మాత్రం కరెక్టు కాదంటున్నారు న్యాయ నిపుణులు. ఇలాగే మరికొన్ని సంఘటనలు జరిగితే.. పోలీసులు స్పీడ్ గా పనిచేయడం కుదరనీ, ప్రతి దాన్నీ ఆచి తూచి చూసి కానీ రంగంలోకి దిగరనీ వీళ్ళు అంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy