పోలీస్ శాఖలో వసూల్ రాజాలు : 391 మంది ఖాకీలపై చర్యలకు రంగం సిద్ధం

policeతెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రిలీజ్ చేసినట్టు ప్రచారం జరుగుతోన్న అవినీతి పోలీసుల లిస్ట్  ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎంత వాస్తముందో తెలియదు కాని… సొంత శాఖలో అవినితీని పరుల లిస్టు బయటపడటం డిపార్ట్ మెంట్ లో చర్చకు దారితీసింది. లిస్టును  సొంత శాఖలో కొందరు సమర్థిస్తోంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.. వసూల్.. ఇపుడు ఈ మాట వింటేనే పోలీస్ శాఖలో సిబ్బంది కలవరపడుతున్నారు.

చీమ చిటుక్కుమన్నా.. వాలిపోయే పోలీస్ శాఖలో ఈ నెలవారీ వసూళ్ల దందాలో కిందిస్థాయి సిబ్బంది పేర్లు బయటకువచ్చాయి. ఇందులో ఐడీ పార్టీ పోలీసులే ఎక్కువమంది ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్లు కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు. మాపై చర్యలు సరే.. మా వెనుకున్న పెద్దల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. తమ వసూళ్లపై లీకులిచ్చి చర్యలు తీసుకుంటే.. తమ వెనక ఉన్నవాళ్లపై కూడా అదే యాక్షన్ ఉండాలంటున్నారు.

కరప్షన్ లిస్టులో మొత్తం 391 మంది ఉంటే, ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 40 మంది ఉన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35 మంది, కరీంనగర్ జిల్లాలో 34 మంది, నిజామాబాద్ జిల్లాలో 29 మంది, వికారాబాద్ జిల్లాలో 27 మంది, పోలీసులు నెలసరి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు లిస్టు రిలీజ్ చేశారు. ప్రతీ ఏరియాలో ఏ దందా చేయాలన్నా, పోలీసులు చూసీ చూడనట్టుగా ఉండాలన్నా.. సెక్టార్ ఎస్సై నుంచి స్టేషన్ సీఐ,జోన్ ఏసీపీ దాకా నెలనెలా మామూళ్లు ముట్టజెప్పాల్సిందే అంటున్నారు లిస్టులో ఉన్న కిందిస్థాయి సిబ్బంది.

అయితే సీన్ ఇక్కడితే కంప్లీట్ కాలేదు..ముందుంది ముసళ్ల పండగ అంటున్నారు పోలీస్ బాసులు..ఇది శాంపిల్ మాత్రమే నెక్స్ట్ లిస్టులో ఎస్సైలు,సీఐలపై యాక్షన్ తీసుకుంటామంటున్నారు.. ఇప్పటికే రిలీజ్ చేసిన కరప్షన్ కానిస్టేబుల్స్ వాంగ్మూలాల్ని రికార్డు చేస్తామంటున్నారు అధికారులు..కానిస్టేబుల్స్ కాబట్టి బదిలీలతో సరిపెట్టాం..ఎస్సై లకి, సీఐలకి ఏసీపీలకి చార్జ్ మెమోలు ఇష్యూ చేయడంతో పాటు డిసిప్లినరీ యాక్షన్ తీసుకొంటామంటున్నారు. అంతే కాదు ఇప్పటికే 43 మంది ఎస్సైలు , 18 మంది సీఐ లతో పాటు 6గురు డీఎస్పీలపై యాక్షన్ తీసుకునేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy