పోస్టర్ పడలేదు.. ఫుల్ డిమాండ్

4అనుపమ పరమేశ్వరన్.. మళయాళంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. మాంచి అందగత్తె. ఈ కుట్టీ నటించిన ప్రేమమ్ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఇరగదీసిందంట. సహజంగానే పక్క భాషల్లో హిట్టయిన సినిమా కథలను రీమేక్ చేసే మన తెలుగు స్టార్స్ కు ఈ సినిమాపై కన్నుపడింది. నాగ చైతన్య హీరోగా ప్రేమమ్ రీమేక్ కానుంది. అయితే ఇందులో హీరోయిన్ కూడా మళయాళంలో నటించిన అమ్మడు అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. ఈ కొత్త కుట్టీ టాలెంట్ చూసి.. మన ప్రొడ్యూసర్స్, హీరోలు వెంటపడుతున్నారంట. నాగచైతన్య సినిమాకు ఓకే అయ్యిందో లేదో.. వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అ.. ఆ మూవీలో ఓ స్పెషల్ రోల్ ఆఫర్ కొట్టేసింది. అంతేకాదండీ.. దిల్ రాజు, రవితేజ మూవీలోనూ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో పోస్టర్ కూడా పడలేదు.. అప్పుడే ఆఫర్స్ పై ఆఫర్స్ కొట్టేయటమే హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ అమ్మాయిలో ఉన్న బ్యూటీ ఏంటా అని తెగ వెతికేస్తున్నారంట సినీ జనం. ఫ్రెష్ బ్యూటీ.. ఎంత మందికి ఎర్త్ పెడుతుందా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది ఇండస్ట్రీలో.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy