ప్యారీస్ వాతావరణ ఒప్పందంలో భారత్ ప్రతిపాదనలు

COP21 Climate Change Conference12 రోజులుగా జరుగుతున్న కాప్ సదస్సు చివరి స్టేజ్ కు చేరింది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి భూమిని రక్షించేందుకు… ఒప్పందం సిద్దమైంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రూపొందించిన క్లైమేట్ రెస్క్యూ అకార్డ్ ఫైనల్ డ్రాఫ్ట్ ని… సమావేశంలో ప్రవేశపెట్టారు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్. ఇందులో భారత్ ప్రతిపాదనలకూ స్థానం కల్పించారు.

ప్రపంచ వాతావరణ ఒప్పందం ఆవిష్కారమైంది. పారిస్ లో జరుగుతున్న కాప్21 సదస్సులో… చరిత్రాత్మక… ఒప్పందానికి పునాది పడింది. 200 దేశాల ప్రతినిధులు, అధికారుల మధ్య… ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీల సమక్షంలో… గ్లోబల్ క్లైమేట్ అకార్డ్ ని ప్రజెంట్ చేశారు లారెంట్ ఫాబియస్.

శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో దశాబ్దాలుగా… భూతాపం, గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్న ప్రపంచ చరిత్రలో ఇదొక హిస్టారికల్ మెజర్. ఇప్పటిదాకా అత్యంత వేడిమి గల సంవత్సరంగా గుర్తింపబడిన 2015 చివర్లో… గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు… ప్రపంచదేశాలు కంకణం కట్టుకున్నాయి. కారణం మీరంటే మీరేనని… ధనిక, పేద దేశాల కొట్లాడుకుంటున్న టైమ్ లో… ఐక్యరాజ్యసమితి చేసిన కృషితో… ఒప్పందం సాధ్యమైంది. ఈ ఫైనల్ డ్రాఫ్ట్ లో… చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు, చేర్పులకు అవకాశం లేదని స్పష్టం చేశారు ఫాబియస్.

వాతావరణ ఒప్పందం, ప్రతిష్టాత్మకమైనదన్నారు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్. ఇది చాలా బ్యాలెన్స్ డ్ గా ఉందన్నారు. డ్రాఫ్ట్ కోసం శుక్రవారం ఉదయం వరకు చర్చలు జరిగాయి. భూమి ఉష్ణోగ్రతను… 2డిగ్రీ సెల్సియస్ కు తగ్గించడం, 2020 వరకు అభివృద్ది చెందిన దేశాలు… 100బిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు చేయడం, ఐదేళ్లకోసారి ఒప్పందాన్ని సమీక్షించేలా… డ్రాఫ్ట్ లో పొందుపరిచారు. ఈ డీల్ ఫైనలైజ్ అయితే… ప్రపంచ పౌరులందరికీ ఇదొక పవర్ ఫుల్ సింబల్ అవుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా భూమిని కాపాడేందుకు… ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నీ మద్దతిస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy