ప్రచారం మొదలైంది : IPL -11 స్పెషల్ సాంగ్ ఇదే

ipl 2018క్రికెట్ ఫ్యాన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL సీజన్ -11కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే వేలం, షెడ్యూల్ తో ఆసక్తిని పెంచిన IPL యాజమాన్యం..ప్రచారంలో భాగంగా ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. టీమ్స్ ప్లేయర్స్ ను చూపిస్తున్న ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది IPL.  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్‌కు సంబంధించిన ఈ సాంగ్ ను లీగ్ నిర్వాహకులు ఆవిష్కరించారు. లీగ్ చరిత్రలో తొలిసారి BCCI, ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ ఇండియా సంయుక్తంగా ఈ సంవత్సరం పాటను రూపొందించాయి.

బెస్ట్ వర్సెస్ బెస్ట్ అనే పేరుతో విడుదలైన థీమ్ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీన్ని దేశ వ్యాప్తంగా హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడ, తెలుగు భాషల్లో అన్ని ఫ్లాట్‌ఫామ్స్(టీవీ, రేడియో, డిజిటల్)లో విడుదల చేశారు. ఈ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఆర్టిస్ట్‌లు పనిచేశారు. సౌతాఫ్రికా ఫిల్మ్‌మేకర్ డాన్ మేస్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ వీ.భల్లా ఆధ్వర్యంలో గాయకుడు సిద్ధార్థ్ బస్రుర్ ఐదు భాషల్లో ఈ సాంగ్‌ను పాడారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy