ప్రజల్లోనే ఉంటా.. ప్రశ్నిస్తూనే ఉంటా : రేవంత్ రెడ్డి

 కొడంగల్ నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో 95 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ గెలుపు తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వయం పాలనకు, అభివృద్ధికి విఘాతం కల్గించేలా ఉందని అన్నారు. తాను ప్రజల తీర్పును గౌరవిస్తానని.. ఓడినా ప్రజలతోనే ఉంటానని తెలిపారు.  ప్రజల సమస్యలపై ఎప్పటికీ తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏమైనా గోల్మాల్ చేసిందా ?.. అనే అనుమానాలున్నాయని అన్నారు. ఈ విషయంపై పార్టీలో విశ్లేషించుకున్న తర్వాతే స్పందిస్తామని తెలిపారు.

టీడీపీ అధినేతలు.. ఎన్టీఆర్.. చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీ చాలాసార్లు ఓడారు.. గెలిచారు… ఓటమైనా.. గెలుపైనా ఎవరి సొత్తు కాదని రేవంత్ అన్నారు.  టీఆర్ఎస్ కు మంచి విజయం దక్కిందని.. దాన్ని చూసుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే భవిష్యత్తులో టీఆర్ఎస్ ఓటమిపాలవడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా మరింత బాధ్యత గా కేసీఆర్ పాలన చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

ఈ టర్మ్ ఫాం హౌస్ నుండి కాకుండా సచివాలయం నుండి  పాలన చేస్తారని అనుకుంటున్నట్లు రేవంత్ చెప్పారు.ఈసారైనా నిరుద్యోగులకు.. అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. తన సవాల్ పై కేటీఆర్ స్పందించలేదని… కేటీఆర్ స్పందన పైనే తన నిర్ణయం ఉంటుందని తెలిపారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy