ప్రజల ముందుకు పౌరసేవలు : కేటీఆర్

ktrdomaప్రజల ముందుకు పౌరసేవలను తీసుకురావడమే ఈ – పంచాయతీల లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేట్‌లో ఈ-పంచాయతీ సేవలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోపు 700 పంచాయతీల్లో ఈ- పంచాయతీ అమలు చేస్తామని తెలిపారు.  కొత్తగా ప్రారంభించిన ఈ -పంచాయతీల ద్వారా భూరికార్డులు, ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రజలకు చేరువ కానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, విప్ గంపగోవర్ధన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy