ప్రజాజీవన అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం : సోనియా

soniaకాంగ్రెస్ కు 125 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు  UPA చైర్ పర్సన్  సోనియా గాంధీ. శనివారం (మార్చి-17) కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.  కేంద్రం వైఖరినీ తావ్రంగా ఖండిస్తున్నామన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని తానెప్పుడు అనుకోలేదని తెలిపిన సోనియా..కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.

ప్రధాని  మోడీ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్న సోనియా..  కాంగ్రెస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.  40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ చిక్‌మగ్‌లూరు నుంచి విజయం సాధించి దేశానికి సేవలందించారని గుర్తు చేశారు.  అందరి ఐక్యత వల్లే పదేళ్లు అధికారంలో ఉండగలిగాం. 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు.

ప్రజాజీవన అభివృద్ధే లక్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని..అందుకే 2009లో మళ్లీ అధికారంలోకి రాగలిగామని చెప్పారు. దేశ సమగ్రత సౌర్వభౌమాధికారమే కాంగ్రెస్ ఆశయమని తెలిపిన సోనియా..గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను బలపరుస్తున్నారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, పెద్దలంతా తనకు అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించారని తెలిపారు సోనియా.  మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యేక దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని తెలిపిన సోనియా..జాతీయ, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రజా జీవితానికి భరోసానిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని.. అన్యాయం, అవినీతిపై కాంగ్రెస్ నిత్యం పోరుడుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉండలని ఈ సందర్భంగా పిలుపునిచ్చరు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని..వచ్చే ఎన్నికల్లో  దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సోనియా గాంధీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy