ప్రజా సమస్యలే ఎజెండాగా

Party Symbolsఅసెంబ్లీ వేదికగా వార్ కు రెడీ అయిన ప్రతిపక్షాలు

ఇన్నాళ్లూ రాష్ట్ర సర్కారుపై ఆరోపణలు, విమర్శలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వార్ కు రెడీ అయ్యాయి. ప్రజా సమస్యలే అజెండాగా సర్కారును ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు, కరువు పరిస్థితులు, ప్రాజెక్టుల రీడిజైన్లతో సెషన్ హాట్ హాట్ గా జరిగే చాన్సుంది. సమస్యలపై ఇప్పటికే ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలు.. వాటని సభలో లేవనెత్తేందుకు సిద్దమయ్యాయి. సెషన్లో మెయిన్ గా రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఎంచుకుంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. దీంతో పాటు.. జనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై చర్చకు పట్టుబడతామంటున్నారు ఆపార్టీ నేతలు.

జనం సమస్యలపై సభలో సర్కారును నిలదీస్తామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 21 అంశాలపై చర్చకు సిద్ధమంటోంది టీడీపీ. సెషన్ 15 రోజులు నడపాలని డిమాండ్ చేస్తోంది. ప్రతి ఒక్క సమస్యపై సభలో చర్చించి పరిష్కారం చూపాలన్నారు టీడీపీ లీడర్స్.

మరోవైపు బీజేపీ, వామపక్షాలు కూడా సర్కారుపై వార్ షురూ చేయాలని డిసైడైయ్యాయి. రైతు సమస్యలతో పాటు ప్రాజెక్టుల డిజైన్ మార్పు, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లపై చర్చకు పట్టబట్టనున్నాయి పార్టీలు. కరువు పరిస్థితులతో పాటు రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు నేతలు. అసెంబ్లీ ఫస్ట్ డే సమావేశాలు సంతాప తీర్మాణాలకే పరిమితం కానున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డికి సభ సంతాపం తెలపనుంది. ఇదే టైంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని ప్రతిపాదన చేయనుంది కాంగ్రెస్. తర్వాత బీఏసీ కమిటీ సభ షెడ్యూల్ , ఎజెండా ఫిక్స్ చేయనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy