ప్రణబ్ ఆత్మకథలో సీఎం కేసీఆర్ కు ప్రత్యేక పేజీలు

kcr bookతెలంగాణ సీఎం కేసీఆర్ కి మరో అరుదైన గౌరవం దక్కింది.  ప్రత్యేక తెలంగాణే ఆశ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపైనే ధ్యాస.. ఎక్కడికెళ్లినా.. ఎవ్వరిని కలిసినా ప్రత్యేక తెలంగాణపైనే చర్చ. ఉద్యమ జెండా ఎత్తినప్పటి నుంచి స్వరాష్ట్రాన్ని సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేసిన ఘనత  కేసీఆర్ ది. ఉద్యమ సమయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగక స్వరాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను.. దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయటం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. పదవులనే తృణప్రాయంగా వదిలేశారు. పదవుల కంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తనకు ముఖ్యమని చేతల్లో చూపించారు. ఇదే విషయాన్ని తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన తాజా పుస్తకంలో వివరించారు. మంత్రి పదవుల కంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తనకు ముఖ్యమని ఉద్యమ సమయంలో కేసీఆర్ తనతో చెప్పినట్లు ప్రణబ్ తన పుస్తకంలో ప్రస్తావించారు.

ద కొఅలిషన్ ఇయర్స్ పేరుతో.. ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకాన్ని ఈ మధ్య మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విడుదల చేశారు. యూపీయే హయాంలో జరిగిన విషయాలను అందులో పూస గుచ్చినట్టు వివరించారు. కలిసి వచ్చిన పార్టీలు.. ఆ పార్టీల లక్ష్యాలను కూడా తెలిపారు. ఆ పార్టీలు ఎందుకు యూపీయేలో చేరాయి.. వారి ఉద్దేశాలేంటి… వారి లక్ష్యాలేంటి.. అభివృద్ధిలో ఆ పార్టీల భాగస్వామ్యం ఏంటన్నది కూడా వివరించారు. అందులో.. ఓ పేరాలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి.. ప్రణబ్ ప్రస్తావించారు. తనకు ఏ పదవి ఇస్తారన్నది విషయం కాదని.. తెలంగాణ ఏర్పాటే తనకు ముఖ్యమని కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఒక్కటే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పేవారని ప్రణబ్ స్పష్టంగా తన పుస్తకంలో రాసుకున్నారు. దీంతో.. తెలంగాణ సాధన కోసమే పుట్టిన మహానుభావుడు కేసీఆర్ అని మరోసారి స్పష్టమైపోయింది.

యూపీయే హయాంలో.. అప్పట్లో కేంద్ర కార్మిక మంత్రిగా చేసిన కేసీఆర్ ను.. పదవుల కోసమే యూపీయేలో చేరారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. వారి తోక పార్టీలు కూడా.. చీప్ కామెంట్లు చేశాయి. కానీ.. ఎలాంటి పదవిని అధిష్టించినా.. తన అంతిమ లక్ష్యం తెలంగాణ సాధనే అని.. తెలంగాణ ఏర్పాటు చేస్తారన్న నమ్మకంతోనే కేసీఆర్ యూపీయేలో చేరారని.. ప్రణబ్ ముఖర్జీ రాతలే స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ఎప్పుడైతే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసిందో.. ఆత్హహత్యలకు కారణమైందో.. అప్పట్నుంచి కాంగ్రెస్ కు దూరంగా ఉండడమే కాదు. ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. సబ్బండ వర్ణాలనూ పోరాటంలో భాగస్వామ్యం చేసిన ధీరోదాత్తుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పడు ముఖ్యమంత్రి పదవి కూడా.. కేవలం కుట్రలు అడ్డుకోవడానికి.. రాష్ట్ర ప్రజలను కాపాడుకోడానికే అన్న మాట కూడా.. నిరూపితమవుతోంది. ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర సాధనకు ఎంత తపించారో.. రాష్ట్ర అభివృద్ధికి కూడా కేసీఆర్ అంతే తపిస్తున్నారు. అందుకే.. ప్రజలు తమ మనసుల్లో చిరస్థాయిని కల్పించి.. కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నారు. కేసీఆర్ సంక్షేమాన్ని కాదని మరో పార్టీని కానీ.. మరో నాయకుడిని కానీ గెలిపించుకునేది లేదని తేల్చి చెబుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy