ప్రణబ్ తో కాంగ్రెస్ నేతలు భేటీ

Screen Shot 2015-12-21 at 3.04.34 PMశీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ లో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలను ఆయనకు వివరించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ స్వయంగా వీటికి వత్తాసు పలుకుతున్నారని రాష్ట్రపతికి వివరించారు. పాలనా కేంద్రం అయిన సెక్రటేరియట్ లోనే పార్టీ కండువాలు కప్పుతున్నారని ప్రణబ్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా.. కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని రాష్ట్రపతిని కోరామన్నారు నేతలు. రాష్ట్రపతిని కలిసినవారిలో ఎంపీ గుత్తా, మాజీ ఎంపీలు వివేక్, పొన్నం, బలరాంనాయక్, సురేష్ షెట్కార్, కోమటిరెడ్డి రాజగోపాల్ ఉన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy