ప్రణబ్ వెళ్లేది కలాం ఉన్న ఇంటికే..

pranab-on-kalamజూలై  25న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగిసిపోనుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే పదవీ విరమణ తర్వాత ప్రణబ్ ఎక్కడ ఉండునున్నారు. ఎక్కడికి వెళ్లనున్నారు..? ఈ ప్రశ్నలకు సమాధానం దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఉన్న ఇంటికే ప్రస్తుతం ప్రణబ్‌ వెళ్లనున్నారు. ఆయన రాక కోసం ఆ ఇంటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రణబ్‌ముఖర్జీ కొత్త ఇంటికి వెళ్లిపోతారు.

ఢిల్లీలోని 10 రాజాజీ రోడ్‌లో ప్రత్యేక బంగ్లాను ప్రణబ్‌ముఖర్జీ కోసం సిద్ధం చేశారు. 11,776 చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాలో ఎనిమిది గదులు ఉన్నాయి. ఆయన రాక సందర్భంగా విల్లాలో ఉన్న ఫర్నీచర్‌ను, నేమ్‌ ప్లేట్లను మార్చినట్లు అధికారులు తెలిపారు. నూతన రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం ఈనెల 25తో ముగియనుంది. పదవీ విరమణ అనంతరం ఆయన నివాసం ఉండేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy