ప్రణబ్ సార్ వచ్చేస్తున్నారు

Pranabరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం.. సిటీ వస్తున్న  ప్రెసిడెంట్…ఈ నెలాఖరు వరకు ఇక్కడే ఉంటారు. మధ్యలో కర్ణాటక, ఏపీల పర్యటనకు వెళ్తారు. టూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడపనున్నారు. 27న సీఎం KCRనిర్వహిస్తున్న చండీ యాగానికి హాజరవుతారు. ప్రణబ్ రాకతో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ ప్రత్యేకంగా ముస్తాబైంది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ…ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా…శీతాకాల విడిదికోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాంలో గడపనున్నారు. ఇవాళ్టీ నుంచి ఈ నెల 31 వరకు ఇక్కడ బసచేయనున్నారు. ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి హకీంపేట విమానాశ్రయానికి రానున్నారు ప్రణబ్. అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుని రెస్ట్ తీసుకుంటారు.

రాష్ట్రపతి రాక సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది సర్కార్. ఇవాళ రాష్ట్రపతి నిలయంలోనే ఉండనున్న ప్రణబ్…రేపు సికింద్రాబాద్ లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాన్వొకేషన్ లో పాల్గొంటారు. ఆ తర్వాత 22న కర్ణాటకలోని గుల్బర్గా సెంట్రల్ యూనివర్సిటీ రెండో వార్షికోత్సవానికి హాజరవుతారు. అదే రోజున బెంగళూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ లో ఇటీవలే పునరుద్దరించిన హెరిటేజ్ బిల్డింగ్ ను ప్రారంభిస్తారు.

23న బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్ 150 వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత బెంగళూర్ లో నిర్మించనున్న స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. 25న ఏపీలోని భీమవరంలో టీటీడీ కొత్తగా ఏర్పాటు చేసిన వేద పాఠశాలను ప్రారంభిస్తారు.

27న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆదే రోజు ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయుత చండీయాగానికి హాజరవుతారు. 29న రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందుకు అటెండ్ అవుతారు. 30న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు రిసెప్షన్ పార్టీ ఇస్తారు. 31న తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు రాష్ట్రపతి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy