ప్రణయ్ హత్య కేసులో వేముల వీరేశం పాత్రలేదు : ఎస్పీ

మిర్యాలగూడ :  నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్రలేదని జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పారు. గతంలొ ప్రణయ్-అమృతలను వేముల వీరేశం ఒకసారి బెదిరించినట్టుగా తెలిసిందన్నారు. పెద్దలను ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని వీరేశం సూచించారని చెప్పారు. తాను కూడా కులాంతర పెళ్లి చేసుకున్నానని అమృత-ప్రణల్ లకు చెప్పిన వేముల వీరేశం.. పెద్దలను ఒప్పించి చేసుకున్న పెళ్లిల్లే నిలబడతాయన్నారు.

అప్పట్లో ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో.. అప్పటి ఎస్పీ శ్రీనివాస్ వేముల వీరేశంతో మాట్లాడి.. ప్రణయ్ – అమృత వ్యవహారంలో కలగజేసుకోవద్దని సూచించారని వివరించారు ఎస్పీ రంగనాథ్. ఆ తర్వాత వీరేశం ప్రణయ్ విషయంలో ఎంటర్ కాలేదన్నారు. కరీం కాంగ్రెస్ పార్టీ నేత అయితే… అస్గర్ కు ఎంఐఎం పార్టీ మెంబర్ గా ఉన్నారని చెప్పారు. ఐతే… ఈ కేసుతో రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వ్యక్తిగతంగా మారుతీరావు పెంచుకున్న పగ కారణంగా జరిగిన హత్య అని అందులో వీళ్లంతా పాలుపంచుకున్నారని చెప్పారు ఎస్పీ రంగనాథ్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy