ప్రతిపక్షాల సవాల్ : కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్

meera-kumarరాష్ట్రపతి ఎన్నికలకు పోటీ తప్పడంలేదు. తమ అభ్యర్థిగా మీరా కుమార్ ను ప్రకటించాయి యూపీయే పక్షాలు. గురువారం (జూన్ 22) పార్లమెంట్ లో విపక్షాలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, NCP నేత ప్రఫుల్ పటేల్, ప్రతిపక్షంల ఉన్న 16 పార్టీల నేతలు హాజరయ్యారు.

రాష్ట్రపతి అభ్యర్థుల కోసం గోపాలకృష్ణ గాంధీ, ప్రకాష్ అంబేద్కర్ పేర్లను సూచించాయి వామపక్షాలు. కాంగ్రెస్ మాత్రం మీరా కుమార్, షిండే వైపు మొగ్గుచూపింది. సుధీర్ఘ చర్చల తర్వాత మీరా కుమార్ ను ఫైనల్ చేశారు.

బీహార్‌కు చెందిన మీరాకుమార్‌ మాజీ ఉపప్రధాని, ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ కుమార్తె. లోక్ సభకు ఐదుసార్లు ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి రామ్ నాథ్, మీరాకుమార్ ఇద్దరూ దళితులే కావటంతో రాష్ట్రపతి పోటీ ఇంట్రెస్టింగ్ గా మారనుంది. జూలై 17వ తేదీ రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy