ప్రతీ డివిజన్ కేంద్రంలో MCH : పోచారం

pocharamరాష్ట్రంలోని ప్రతీ డివిజన్  సెంటర్ 100 పడకల మదర్ కేర్ చైల్డ్(MCH) ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. రూ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 17 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 100 పడకల మాతా-శిశు సంరక్షణ ఆస్పత్రికి మంత్రి పోచారం భూమి పూజ చేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా MCHలను నిర్మిస్తున్నామని తెలిపారు. 9 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిందన్నారు. గర్భిణీల సౌకర్యవంతం కోసం ఆస్పత్రుల్లో అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి పోచారం.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy