ప్రత్యేక అతిధులు : పిలుపు లేకపోయినా పెళ్లికి వచ్చేస్తారు

Marriage-it

పెళ్లంటే వరుడు, వధువు ఉంటే చాలక ఇక నుంచి. మీ ఇంట్లో శుభకార్యానికి వాళ్లను పిలవాల్సిన అవసరం లేకపోయినా.. ప్రత్యేక అతిధులుగా వచ్చేస్తారు. పిలవని పెళ్లి పెద్దలు కూడా వాళ్లే అవుతారు. నువ్వెవరు.. నీకేంటి సంబంధం అని అడిగే రైట్ కూడా మీకు ఉండదు. మీ ఇంట్లో పెళ్లిని వీడియో తీయటం మీరు మర్చిపోయినా.. వాళ్లు మాత్రం ఖచ్చితంగా తీస్తారు. ఇక నుంచి ఎవరింట్లో పెళ్లి అయినా సరే.. వాళ్లు హాజరుకావటం కామన్. వాళ్లెవరో కాదండీ.. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు.

పెద్దనోట్లు రద్దై దేశంలోని ప్రజల పరిస్థితి చక్కబడకముందే కేంద్రం మరో ఝలక్ ఇచ్చింది. అవినీతిని సహించబోమన్న మోడీ.. చిన్న చిన్న వ్యాపారులను, మధ్యతరగతి జోలికి వెళ్లమని హామీ ఇచ్చారు. కొత్తగా ఐటీ చట్ట సవరణతో ఇబ్బందులు తప్పవని సంకేతాలు ఇస్తున్నారు ఆదాయ పన్నుశాఖ అధికారులు.

ఇంట్లో పెళ్లి అయినా.. వీధిలో పేరంటమైనా లెక్కలు చూపించాల్సిందే అంటోంది ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం. సంపాదన, వ్యాపార లవావాదేవీలు, బ్యాంక్ డిపాజిట్ లకు లెక్కలు సరితూగకపోతే.. ఆదాయ పన్ను చట్ట పరిధిలోకి వస్తారని చట్టం చెబుతోంది. దీని ప్రకారం 35 శాతం నుంచి 83 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఐటీ చట్ట సవరణతో పక్కింట్లో మాట పూచికత్తుతో అప్పు తెచ్చుకున్నా ఆధారాలు ఉండాల్సిందేనంటున్నారు.

స్నేహితుడి నుంచో లేక తెలిసిన వాళ్ల నుంచో అప్పు తెచ్చుకున్నా.. ఆదాయానికి మించిన లెక్కలపై విచారించే అధికారం ఉందంటున్నారు. బ్యాంక్‌ ఖాతాలో ఎక్కువ డబ్బు జమ అయినా సరే వివరణ ఇవ్వాల్సిందే అంటున్నారు వీళ్లు. దేనికైనా ఆధార పత్రాలే కీలకమంటున్నారు. ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా పెళ్లి ముహూర్తాలు బాగా ఉన్నాయి. ఈ నెలంతా ఐటీ అధికారులకు పెళ్లి భోజనాలే భోజనాలు.. విందులే విందులు..

ఐటీ అధికారులు ఇంటికి ఎప్పుడు వస్తారంటే..

వారసత్వంగా వచ్చిన ఆస్తి, ఆదాయం, బంగారం, భూమి ఏదైనా సరే.. అది వారసత్వంగా వచ్చిందనడానికి తరతరాలుగా సంక్రమించినట్టు సంబంధిత పత్రాలు చూపించాలి. పత్రాలు లేకపోతే.. అంటే ఆధారాలు లేనప్పుడు మీరు పన్నుపరిధిలోకి వస్తారు. అప్పుడు ఆదాయపన్నుశాఖ అధికారులు ఇంటికే రావచ్చు

స్టార్టప్స్‌ కంపెనీలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రస్తుతం నడుస్తున్నంత వరకు ఎంతమేర ఖర్చులు, జమ అయ్యాయో పత్రాలు ఉండాల్సిందే. ఐటీ అధికారులకు రికార్డులను సమర్పించడంలో విఫలమైతే… అధిక పన్ను భారం పడుతుంది.

ఇళ్లల్లో జరిగే ఆడ/మగ పిల్లల పెళ్లిళ్ల ఖర్చుకు సంబంధించిన లెక్కలకు తాజా ఐటీ నిబంధనల ప్రకారం లెక్క తీయాల్సిందే. పెళ్లికి ఎంత ఖర్చయింది.. దేనికి ఎంత అని వివరణాత్మకంగా ఐటీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. పెళ్లికి ముందు బ్యాంక్ బ్యాలెన్స్.. పెళ్లి తర్వాత బ్యాంక్ స్టేట్ మెంట్ చూస్తారు. తేడా వచ్చిందో వివరణ కోరతారు. అప్పుడు చిన్నపాటి బిల్లులు లేకపోయినా.. మూలధనం మొత్తంలో 35 శాతం నుంచి 85 శాతం దాకా పన్ను కట్టాల్సి ఉంటుంది.

ఇంటికి బంధువులు వచ్చారని.. నాటు కోడి చికెన్ లేదా మటన్ తెచ్చి విందు భోజనాలు పెట్టి ఆ నెలలో నెలసరి ఖర్చులు పెరిగినా.. ఐటీ అధికారుల నిఘా ఉంటుంది. ఐటీ అధికారులు ఇంటికొచ్చినప్పటి నుంచి మీ అకౌంట్ పై 24 గంటలు వాచ్ డాగ్ లా పనిచేస్తుంది ఐటీ నిఘా కెమెరా.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy