ప్రత్యేక స్కీమ్ తో మిర్చి రైతును ఆదుకున్నకేంద్రం

venkaiahమిర్చి రైతులను ఆదుకోవటానికి ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాణిజ్య పంట అయిన మిరపకు కనీస ధర నిర్ణయించే విధానం లేకపోవడంతో…వారం రోజులుగా ధర భారీగా పతనమైంది. ప్రారంభంలో క్వింటా రూ.15 వేలు పలికితే.. ఇప్పుడు అదే క్వింటా రూ.3వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఎంతగా అంటే చివరకు మిర్చిని తగలబెట్టుకునే వరకు వచ్చారు. రైతుల ఆందోళలనపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో.. వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద మిర్చి కొనుగోలు చేయటానికి నిర్ణయించింది బీజేపీ సర్కార్. కనీస మద్దతు ధర క్వింటాకి రూ.5వేలుగా నిర్ణయించారు. అదనపు ఖర్చుల కింద మరో రూ.1500 ఇస్తున్నారు. అంటే రూ.6,500 గిట్టుబాటు అవుతుంది. మే 31వ తేదీ వరకు ఈ కొనుగోళ్లు జరగనున్నాయి. ప్రతి 2వేల ఎకరాలకు ఓ కొనుగోలు పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసే ఈ మిర్చికి నష్టం వస్తే.. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 33వేల 700 మెట్రిక్ టన్నుల మిర్చి పంట అమ్మకానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని మిర్చి రైతలు ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. ప్రత్యేకంగా గిట్టుబాటు ధర నిర్ణయించటంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కృషి చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చొరవతోనే  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మిర్చి కోసం ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద పంట కొనుగోలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy