ప్రత్యేక హోదాపై ఏపీలో పెరిగిన పొలిటికల్ హీట్

map-APప్రత్యేక హోదాపై కేంద్రం చేతులెత్తేయడంతో ఏపీలో పొలికల్ హీట్ పెరిగింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దీంతో ప్రత్యేక హోదాపై పరువు నిలబెట్టుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. విపక్షాళ ఆందోళన నేపధ్యంలో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు చంద్రబాబు నాయుడు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై ఎంపీలతో చర్చించనున్నారు.

APకి ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు వైసీపీ అధినేత జగన్. ప్రత్యేక హోదాపై ఎన్నికలముందు ఒకలా…తర్వాత మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చంద్రబాబు.. కాంగ్రెస్ ను విమర్శించటం విడ్డూరగా ఉందన్నారు ఎంపీ కేవీపీ రామచంద్రరావు. బాబు సీరియస్ గా ప్రయత్నిస్తే హోదాను సాధించుకోవచ్చని చెప్పారు.

కోసం అవసరమైతే రాజీనామాకు రెడీ అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.  తెలంగాణకు నిధులు రాకుండా వెంకయ్యనాయడు, చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఎంపీ కవిత. ఏపీకి హోదా దక్కకపోవడానికి బాబు, వెంకయ్యలే కారణమని ఆరోపించారు పొన్నం ప్రభాకర్.  విపక్షాలన్నీ టీడీపీని టార్గెట్ చేయడంతో.. కౌంటర్ కు ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy