ప్రధాని ఆశీర్వాదం తీసుకున్న మాస్టర్ బ్లాస్టర్

MODI-SACHINమాజీ క్రికెటర్.. మాస్టర్‌ బ్లాస్టర్‌, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం (మే19) ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. భార్య అంజలితో కలిసి ప్రధాని కార్యాలయంలో కలుసుకున్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘సచిన్‌ ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రం వచ్చే శుక్రవారం (మే 26) విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా తాను చిత్రం విశేషాలకు సంబంధించిన వివరాలను  మోడీ వివరించానని పేర్కొంటూ మోడీతో కరాచలనం చేస్తున్న ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. మోడీ ఆశీర్వాదం కూడా తీసుకున్నట్లు సచిన్‌ చెప్పారు.

ఈ సందర్భంగా ప్రధాని తనకు శుభాకాంక్షలు చెప్పారని అన్నారు. హాలివుడ్‌ దర్శకుడు జెమ్స్‌ ఎర్సకైన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సచిన్‌ జీవితంలో ఎవరికీ తెలియని అంశాలు చాలా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సచిన్‌ వ్యక్తిగత జీవితం నుంచి యువకుడిగా క్రికెట్‌కు ఒక కలికితురాయిగా మారిన తీరు వరకు ఈ చిత్రంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఛత్తీస్‌గఢ్‌, కేరళ రాష్ట్రాలు పన్ను మినహయింపునిచ్చాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy