ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ

big battery ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఆస్ట్రేలియాలో తయారవుతోంది. దీన్ని 100 మెగావాట్ల సామర్థ్యంతో రూపొందించబోతున్నారు. ప్రముఖ సంస్థ టెస్లాకు ఈ భారీ బ్యాటరీ కాంట్రాక్టు దక్కింది. దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో ఈ భారీ లిథియం-అయాన్‌ బ్యాటరీ ఏర్పాటవుతుంది. బొగ్గుతో నడిచే విద్యుత్‌ కేంద్రాలను నిలిపివేసి, పవన, సౌర, గ్యాస్‌ వనరులపై ఆధారపడాలని నిర్ణయించింది ఈ రాష్ట్రం. అయితే గాలి ఉద్ధృతి సరిగా లేని సమయంలో సరఫరా కోసం ముందుగా కొంత విద్యుత్‌ను నిల్వ చేయడానికి సరైన వసతులు అక్కడ లేవు. దీంతో ఇటీవల అక్కడ విద్యుత్‌ అంతరాయాలు ఎక్కువయ్యాయి.  ఈ సమస్యతోనే ఈ బ్యాటరీ యోచన తెరపైకి వచ్చింది. కాంట్రాక్టు ఒప్పందంపై సంతకం చేసిన 100 రోజుల్లోగా ఈ వంద మెగావాట్ల బ్యాటరీ సిద్ధం చేస్తామని, లేదంటే దాన్ని ఉచితంగా నిర్మించి ఇస్తామని చెప్పారు టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌. గడువులోగా నిర్మాణం పూర్తికాకుంటే కంపెనీపై 5 కోట్ల డాలర్ల మేర భారం పడుతుందన్నారాయన. విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు దాదాపు 30వేల ఇళ్లల్లో ఈ బ్యాటరీ వెలుగులు నింపుతుంది. ఫ్రాన్స్‌కు చెందిన నియోయెన్‌ సంస్థ నిర్మిస్తున్న పవన విద్యుత్‌ కేంద్రంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన 80 మెగావాట్ల లిథియం-అయాన్‌ బ్యాటరీ ప్రాజెక్టును అధిగమించి, ఇది ప్రపంచంలోనే భారీ బ్యాటరీగా గుర్తింపు పొందనుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy