ప్రపంచంలోనే తొలిసారి… తలను మార్చేస్తున్నారు

operationవైద్య శాస్త్ర చరిత్రలో అత్యంత అరుదుగా భావిస్తున్న తల మార్పిడి (హెడ్ ట్రాన్స్ ప్లాంటేషన్ ) కు రంగం సిద్ధమవుతోంది. వెర్డినిగ్ హాఫ్ మన్ అనే ఓ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న వాలెరీ స్పిరిడొనొవ్ ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ కు రెడీ అవుతున్నాడు. రష్యాకు చెందిన ఈ 31 ఏళ్ళ కంప్యూటర్ సైంటిస్ట్ ఆ వ్యాధి వల్ల చాలా ఏళ్ళుగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు.

ఇటలీ కి చెందిన సర్జన్ డాక్టర్ ఫ్రాంకెన్ స్టీన్ సహకారంతో సెర్గీ కానవరొ అనే న్యూరోసర్జన్ ఈ ఆపరేషన్ చేయనున్నాడు. వాలెరీ తలను తీసేసి ఆరోగ్యవంతమైన మరో శరీరానికి అమర్చడం ఈ ఆపరేషన్. ఈ ఆపరేషన్ కు సన్నాహాలు కొద్ది నెలల్లో మొదలుపెట్టి 2017 డిసెంబర్ లో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సెర్గీ కానవరో ఈ ఆపరేషన్ కు స్వర్గం (హెవెన్) అని పేరు పెట్టాడు. 36 గంటల పాటు అత్యంత ఆధునికమైన సర్జికల్ ఎక్విప్ మెంట్ ఉన్న ధియేటర్ లో ఇది జరుగుతుంది. ఆపరేషన్ ఖర్చు 122 కోట్ల రూపాయలు ( 14 మిలియన్ పౌన్లు). 150 మంది డాక్లర్లు, 300 మందికి పైగా నర్సింగ్ స్టాఫ్ ఈ ఆపరేషన్ లో ఇన్ వాల్వ్ అవుతారు.

దాత, స్వీకర్తల తలలు రెంటినీ ఒకేసారి తొలగించి దాత దేహానికి స్వీకర్త తలను అమరుస్తారు. పాలిథిలైన్ గ్లైకాల్ అనే పదార్థం ద్వారా అతుకుతారు. అయితే కొత్త బ్రెయిన్ ఇచ్చే సంకేతాలను కొత్త బాడీ ఎలా స్వీకరిస్తుందనేది ప్రశ్నార్థకమే.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి దేహానికి వాలెరీ తలను అమరుస్తారు. సర్జరీ తర్వాత అతను కొన్ని వారాల పాటు కోమాలోనే ఉండి క్రమక్రమంగా కోలుకుంటాడని చెబుతున్నారు.

45 ఏళ్ళ కిందట ఓ కోతి బుర్రని మరో కోతి శరీరానికి అమర్చారు. ఎనిమిది రోజుల పాటు నరకయాతన పడ్డాక ఆ కోతి చనిపోయింది. శ్వాస తీసుకోవడం దానికి చాలా కష్టమయ్యింది. ఈ మధ్యే ఓ ఎలుకకు ఇలాంటి ఆపరేషన్ నే చేశారు చైనా వైద్యులు. అదీ ఎక్కువ కాలం బతకలేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy