ప్రపంచం ఇండియా వైపు చూస్తోంది: మోడీ

28br63cశాన్ ఫ్రాన్సిస్కో… శాన్ హోసే… ఎస్ఏపీ సెంటర్…. మరో మ్యాడిసన్ స్క్వేర్ ని తలపించింది సాప్ సెంటర్. వేలాదిమంది మంది ఎన్నారైలతో సాప్ సెంటర్ హోరెత్తింది. ప్రధాని మోడీ స్పీచ్ కు… ఎన్ఆర్ఐలు ఫిదా అయ్యారు. ప్రధాని ఇన్స్ స్పిరేషనల్ స్పీచ్ కు ఫ్లాటయ్యారు. పోరాటయోధుడు భగత్ సింగ్ ను స్మరించుకుంటూ స్పీచ్ ను మొదలుపెట్టారు నమో. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని.. 21వ శతాబ్దం భారత్ దేనన్నారాయన. ఇంతకుముందు భారత్ నుంచి మేధో వలస… బ్రెయిన్ డ్రెయిన్ కొనసాగిందని.. ఇకపై బ్రెయిన్ గెయిన్ అన్న ముద్ర వస్తుందన్నారు. దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అన్నారు. 125 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో దేశంలో ఎన్నో మార్పులొస్తున్నాయని… ఇంకా రావాలన్నారు.

28br63mతన 16 నెలల పాలనపై మోడీ క్వశ్చన్స్ వేసి… ఆన్సర్స్ ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. 16 నెలల పాలనపై మీ సర్టిపికెట్ కావాలంటూ ఎన్ఆర్ఐలను కోరారు. దేశం కోసం ఎంతైనా కష్టపడేందుకు సిద్ధమని.. అవినీతి అంతానికి కఠిన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. నా మీద ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా అంటూ సభికులను ప్రశ్నించారు. అంతకుముందు కల్చరల్ యాక్టివిటీస్ తో ఆకట్టుకున్నారు ఎన్ఆర్ఐలు. కైలాష్ ఖేర్ తన పాటలతో ఉర్రూతలూగిస్తే… మరికొందరు కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు.

28br63jయూఎస్ పర్యటనలో ఉన్న మోడీ కాలిఫోర్నియాలో ఎన్నారైలతో ఇంట్రాక్ట్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ జన్మదినం రోజున ప్రవాస భారతీయులను కలసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమెరికా ప్రజలు ఇండియన్స్ పట్ల ప్రత్యేక గౌరవం చూపుతున్నారని చెప్పారు. బారతీయుల మేధస్సు ప్రపంచ గమనాన్ని మారుస్తుందన్నారు. మొత్తానికి మ్యాడిసన్ స్క్వేర్ ను మించిపోయేలా సాప్ సెంటర్ ని హోరెత్తించారు మోడీ. రాక్ స్టార్ ఇమేజ్ ని నిలబెట్టుకున్నారు.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy