ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

Christmas Fireplaceప్రపంచ వ్యాప్తంగా క్రిస్ మస్ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. రెండువేల సంవత్సరాల క్రితం జన్మించిన యేసు ప్రభువు జన్మదినాన్ని దేశవ్యాప్తంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రైస్తవ సోదరులు. యేసు నామాన్ని జపిస్తూ చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్థరాత్రి నుంచే క్రీస్తు రాకకోసం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులతో మెరిసిపోతున్నాయి చర్చిలు. అటు క్రీస్తు ప్రార్థననలతో చర్చీల్లో సందడి కనిపిస్తోంది. ఏడాదికోసారి వచ్చే ఈ పర్వదినం రోజున ప్రత్యేక ప్రార్థనలు చేస్తే క్రీస్తు ప్రేమాభిమానాలు దక్కుతాయంటున్నారు క్రైస్తవులు.

అటు క్రైస్తవులు పవిత్రంగా భావించే వాటికన్ సిటీలోనూ క్రిస్మస్ సంబరాలు అబరాన్నంటాయి. క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేశారు క్రైస్తవులు. వాటికన్ క్రిస్మస్ ట్రీ రంగురంగుల దీపాల వెలుగులతో వెలిగిపోయింది. మరోవైపు ప్రజలంతా సుఖ సంతోషాలతో.. వర్థిల్లాలని శాంతి సందేశన్ని అందించారు పోప్ ఫ్రాన్సిస్…. ధైర్యంతో ప్రతీసమస్యను ఎదుర్కోవాలన్నారు. ఇటు రాష్ట్రంలోనూ క్రిస్మస్ సందడి జోరందుకుంది. షాపింగ్ తో మార్కెట్లన్నీ కళకళలాడాయి. ఎక్కడ చూసినా కలర్ ఫుల్ స్టార్స్ ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆసియాలోనే అతి పెద్దదైన మెదక్ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఉదయం నుంచే ప్రార్ధనలకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. దీంతో సెక్యురిటీని టైట్ చేశారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా … హుస్నాబాద్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో జరిగిన వేడుకల్లో చిన్నారుల డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. కేక్ కట్ చేసి క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.వరంగల్ జిల్లాలోనూ క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చీల్లో సందడి కనిపించింది. రంగురంగుల దీపాల వెలుగులతో ప్రార్థనా స్థలాలు మెరిసిపోయాయి.

మహబూబ్ నగర్ జిల్లాలో క్రిస్మస్  సంబరాలు అంబరాన్నంటాయి. క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లాలోని చర్చిలన్నీ విద్యుత్  దీపాలంకరణలతో కొత్తశోభను సంతరించుకున్నాయి. పండగ సందర్భంగా పేదలకు అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు క్రైస్తవులు. ప్రపంచ శాంతిని కాక్షిస్తూ… దేశంలోని అన్ని చర్చిల్లోనూ క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు జరుపుతున్నారు. చారిత్రక చర్చిల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy