ప్రపంచ జనాభా దినోత్సవం: పట్నాలు.. జనసంద్రాలు

city-peopleప్రపంచంలో జనాభా అనూహ్యంగా పెరిగిపోతోంది. 2053 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లు దాటుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో తెలిపింది.  1962 నుంచి ప్రతి ఏటా జనాభాపై రిపోర్టు తయారు చేస్తున్న ఈ సంస్థ.. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాపై రిపోర్టు విడుదల చేసింది.

2050 వరకు యూరప్ లో జనాభా తగ్గుతుందని, అభివృద్ధిలో వెనుకబడిన 48 ఆఫ్రికా దేశాల్లో దాదాపు రెట్టింపు అవుతుందని రిపోర్టులో తెలిపింది. 29 దేశాల్లో రెట్టింపు కంటే ఎక్కవగా ఉంటుందని అంచనా వేసింది. సహారా ఆఫ్రికా దేశాల్లో ఒక్కో మహిళకు ఆరేడుగురు పిల్లులు ఉంటారని తెలిపింది. జపాన్ లో  25శాతానికి పైగా వృద్దులు ఉంటారని, ఖతార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో 65ఏళ్లకు పైబడిన వాళ్లు ఒక్క శాతం మాత్రమే ఉంటారని వివరించింది. ప్రస్తుతం ఆసియా, ఐరోపాల్లోని కొన్ని దేశాల్లో 15ఏళ్ల పిల్లలకంటే 65ఏళ్లకు పైబడినవారే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో తెలిపింది.

పట్నాలకు వలస బాట

మరోవైపు పల్లె పొమ్మంటోంది .. పట్టణం రమ్మంటోంది. ఉన్నత చదువుల కోసం పిల్లలు, ఉపాధి కోసం పేదలు , ఉద్యోగాల కోసం  యువత …ఇలా అందరూ  పట్టణాల  బాటపడుతున్నరు. భవిష్యత్ లో వలసలు మరింత పెరగనున్నాయి. వచ్చే 20 ఏళ్లలో సగం  జనాభా పట్టణాల్లో నివసించనున్నట్లు ఓ అంతర్జాతీయ సంస్థ తాజా సర్వేలో తెలిపింది.

పల్లెల నుంచి వలసలు పెరడగం వల్ల పట్టణాలు జన సంద్రంగా మారుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం టౌన్ కు వస్తున్న వాళ్ల సంఖ్య ఏటా రెట్టింపవుతోంది. 2030 నాటికి దేశంలో సగం జనాభా పట్టణాల్లో నివశించనున్నట్లు   మెకెన్సీ అంతర్జాతీయ సంస్థ తాజా  సర్వేలో స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా పట్టణాల్లో పరిస్థితులు , ఆర్థిక అభివృద్ధిపై అధ్యయనం చేసిన నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందజేసింది. దీని ప్రకారం సగానికి పైగా పట్టణ జనాభా కలిగిన రాష్ట్రాల్లో  తమిళనాడు, గుజరాత్ , మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ తొలి ఐదు స్థానాల్లో ఉంటాయి.

వచ్చే 20 ఏళ్ల నాటికి  తమిళనాడు పాపులేషన్ లో  67 శాతం మంది పట్టణాల్లో నివశించనున్నారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక మన రాష్ట్రంలో 46 శాతం అంటే 4.55 కోట్ల మంది పట్టణాల్లో నివశించనున్నారు. జనాభాతో  పాటు అదే స్థాయిలో  ఉద్యోగ అవకాశాలు  పెరగనున్నాయి. ఇప్పుడున్నదానికంటే 70శాతం అదనంగా జాబ్స్  లభిస్తాయి.  జాతీయ స్థూల ఉత్పత్తిలో పట్టణాల వాటా 70 శాతానికి చేరనుంది. దేశంలో 40 లక్షల జనాభా దాటిన నరగాల సంఖ్య 13 కు చేరుతుంది. ఇందులో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంటుంది. భాగ్యనగర జనాభా 98 లక్ష్లలకు చేరనుంది.

అయితే పెరుగుతున్న జనాభాకనుగుణంగా పట్టణాల్లో సౌకర్యాల కల్పించేందుకు  ప్రభుత్వాలు చర్యతీసుకోవాల్సి ఉంటుందని మెకెన్సీ సంస్థ సూచింది. హైదరాబాద్ , విశాఖ పట్టణం, విజయవాడ నగరాల్లో మెరుగయిన సౌకర్యాల కోసం వచ్చే  20 ఏళ్లలో ఏడాదికి తలసరి 12 వేల  300 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరాల్లో తలసరి తాగునీటి సరఫరా రోజుకు 105 లీటర్లు . దీన్ని 220 లీటర్లకు పెంచాల్సి ఉంటుంది.పట్టణాల్లో ప్రజా రవాణా వాటా 30 నుంచి 82 శాతానికి పెరగాల్సి ఉంది. ప్రస్తుతం పట్టణాల్లో 24 శాతం జనాభా మురికి వాడల్లో నివశిస్తున్నారు. భవిష్యత్ లో మురికివాడలు లేకుండా ఉండాలంటే కేంద్రం ఏటా 15 వేల కోట్లు   ఖర్చు చేయాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy