ప్రపంచ భూ దినోత్సవం : కలెక్టర్ల అరుదైన ఘనత

promise1ఆదివారం ( ఏప్రిల్-22) ప్రపంచ భూ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అరుదైన ఘనతను సాధించారు. కలెక్టర్లు భూమి, పర్యావరణ రక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయటంతో పాటు, రోజంతా హరితహారం పర్యవేక్షణలో గడిపారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో అటవీ శాఖ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలను కలెక్టర్ల బృందం రోజంతా పరిశీలించింది.

సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు ఫారెస్ట్ రీసెర్ఛ్ కాలేజీకి కలెక్టర్ల బృందం ఉదయమే చేరుకుంది. అటవీ శాఖ అధికారులు. ప్రపంచ భూ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కలెక్టర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు ఇతర శాఖలకుచెందిన అధికార యంత్రాంగం పాల్గొన్నారు.

కలెక్టర్ల ప్రతిజ్ఞ
మన మూలలను నిలబెట్టే ఏకైక ఆధారం భూమి మాత్రమే. రోజురోజుకూపెరుగుతున్న కాలుష్య కారకాల నుంచి, ప్లాస్టిక్ వినియోగం నుంచిభూమాతను రక్షించే ప్రయత్నంలో భాగస్వామ్యులమవుతాం. పర్యావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకోవడంలో ప్రధానపాత్ర పచ్చదన పెంపు ఒక్కటే. భూమాతకు పచ్చని ఆభరణమైన తెలంగాణకు హరితహారంలో పాల్గొనడం ద్వారా తెలంగాణను ఆకుపచ్చని రాష్ట్రంగా మారుస్తామని, సమాజంలో అందరినీ ఈ దిశగా చైతన్య పరుస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాం. అంటూ అందరు కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది  ప్రతిజ్ఞ  చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy