ప్రభాస్ చీఫ్ గెస్ట్ : ‘మహానుభావుడు’ ఆడియో డేట్ ఫిక్స్

MAHANUBHAVUDUమారుతి  డైరెక్టసన్ లో శ‌ర్వానంద్ హీరోగా నటించిన ‘ మ‌హానుభావుడు’  సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ఆడియో వేడుక‌కి టైం ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. సెప్టెంబ‌ర్ 16న థ‌మ‌న్ అందించిన రాకింగ్ మ్యూజిక్‌ని రిలీజ్ చేస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు మారుతి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ఇప్పటికే రెండు సాంగ్స్‌ని విడుద‌ల చేయగా..  ఈ సాంగ్స్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అయితే ‘మ‌హానుభావుడు’  ఆడియో వేడుక‌కి చీఫ్ గెస్ట్‌గా ప్ర‌భాస్ హాజ‌రు కానున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. శ‌ర్వానంద్ న‌టించిన ‘ర‌న్ రాజా ర‌న్, ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాల ఆడియోని ప్ర‌భాస్ లాంచ్ చేయ‌డంతో, ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట అయ్యాయి. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ని మ‌రోసారి రిపీట్ చేయాల‌ని టీం భావిస్తుంద‌ట‌. మెహ‌రీన్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీలో శ‌ర్వానంద్ OCD అనే డిసార్డర్‌తో బాధ‌ప‌డుతుంటాడు. ఫ‌న్నీగా మారుతి స్టైల్ లో ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది. యూరప్ , పొల్లాచ్చి, ఇటలీ, ఆస్ట్రియా, క్రోటియా వంటి అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకున్న‌ట్టు సమాచారం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy