ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ : ఫిబ్రవరిలో సహకార సమరం

హైదరాబాద్ : సహకార సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌‌‌‌‌‌‌‌సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వీటిని నిర్వహించాలని ప్రభుత్వం సొసైటీలను ఆదేశించింది.ఫిబ్రవరి మూడో వారంలో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు సహకార శాఖ సిద్ధమవుతోంది.

తొలి విడతగా రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS)లకు ఎన్నికలు నిర్వహిస్తారు. జనవరి 25 తర్వాత నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేసి ఫిబ్రవరి మూడో వారంలో గా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 20 లక్షల మంది ఓటర్లతో ఇప్పటికే సహకార సంఘాల జాబితాలు సిద్ధం చేసింది. తొలి దశలో పీఏసీఎస్‌ లకు, ఆ తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాం కుల(డీసీసీబీల)కు ఎన్నికలు నిర్వహిస్తారు. తర్వాత జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీలు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ప్రతి 200 మందికి ఓ పోలింగ్‌ కేంద్రం

20 లక్షల మంది రైతులున్న 906PACSల పరిధిలోని ప్రతీ 200 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదనపు రిజిస్ట్రార్‌ నేతృత్వంలోని సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల ఏర్పాట్లు చేస్తోంది. పాత జిల్లాలవారీగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మినహా తొమ్మిది డీసీసీబీలతోపాటు టెస్ క్యాబ్ కు ఎన్నికలు జరపనుంది. బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ బాక్సుల సేకరణ, బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్ల ముద్రణపై దృష్టి పెట్టారు అధికారులు. ఒక్కో PACS పరిధిలో 13 మంది డైరెక్టర్లను బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో సంఘంలోని ఓటర్లు ఎన్నుకుంటారు. డైరెక్టర్ల ఎన్నిక తర్వాత వారిలో ఒకరిని చైర్మన్‌‌‌‌‌‌‌‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌ ‌‌‌‌‌‌‌గా ఎన్నుకుంటారు. PACSల చైర్మన్లంతా కలిసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్, వైస్‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ను ఎన్నుకుంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy