ప్రభుత్వాసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు

FAMILEYసంతానం లేని  దంపతులకు.. సర్కార్  శుభవార్త  చెప్పింది. లక్షలకు  లక్షలు  ఖర్చు పెడుతూ.. ప్రైవేట్  హాస్పిటళ్లకు  వెళ్లలేని వారికి…సంతాన సాఫల్య  కేంద్రాలను ప్రభుత్వమే  ఏర్పాటు చేయనుంది.  ముందుగా.. వసతులు  ఉన్న దవాఖానల్లో కేంద్రాలు  ప్రారంభించి.. తర్వాత  రాష్ట్రమంతా  విస్తరించేందుకు  ప్లాన్ చేస్తోంది. పిల్లలు లేని దంపతులు.. ఇకపై ప్రయివేటు హాస్పిటళ్లకు వెళ్లి.. పరీక్షలు చేయించుకునేందుకు వేలకు వేలు.. లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సౌకర్యాన్ని ప్రభుత్వమే డైరెక్ట్ గా కల్పించనుంది. మోసపూరిత ఐవీఎఫ్ సెంటర్లకు బ్రేకులు వేయడంతో పాటు.. సామాన్యులకు మేలు చేసేలా ప్రభుత్వమే సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.

సంతానం కోసం ఆరాట పడుతున్న దంపతులు.. ఈ మధ్య ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తుండడం కామన్ అయపోతోంది. ఈ వీక్ నెస్ తో హాస్పిటళ్లు లక్షలు గుంజుతుండగా.. గైనిక్ పరమైన సమస్యలు తెలుసుకునేందుకు రకరకాల టెస్టులు చేయించడం.. పరికరాల ధరలు భారీగా ఉండడం.. ఫైనల్ గా ఆ భారం అంతా ట్రీట్ మెంట్ చేయించుకునే దంపతులపైనే పడడం మామూలైపోయింది. అందుకే.. ప్రభుత్వం సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఖరీదైన టెస్టులు కూడా చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేసీఆర్ కిట్ ప్రభావంతో.. సర్కారీ దవాఖానలకు రోగుల సంఖ్య పెరిగిందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు.. సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. మరింత మంది ప్రభుత్వ హాస్పిటళ్లలోనే చికిత్స చేయించుకుంటారని అన్నారు. గాంధీ హాస్పిటల్ లో ఇప్పటికే ఫెర్టిలిటీ శిక్షణ తీసుకున్న డాక్టర్లు ఉన్నారని.. కొంత కాలంగా సంతాన లేమి కారణంగా బాధపడే దంపతులు కూడా వస్తున్నట్టు చెప్పారు. జనాల్లో సంతానలేమి సమస్యలు పెరుగుతున్న పరిస్థితిల్లో.. ఫెర్టిలిటీ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకు మేలు చేస్తుందని చెప్పారు డాక్టర్లు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy